BigTV English

Interval Walking Benefits: జాగింగ్ కంటే ఇదే బెస్ట్.. అందుకేనా జపాన్‌లో అంత క్రేజ్ !

Interval Walking Benefits: జాగింగ్ కంటే ఇదే బెస్ట్.. అందుకేనా జపాన్‌లో అంత క్రేజ్ !

Interval Walking Benefits: క్లిష్టంగా ఉండే వ్యాయామాలు చేయకుండానే ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వారికి, జపాన్ దేశానికి చెందిన ‘ఇంటర్వెల్ వాకింగ్’ విధానం ఒక అద్భుతమైన మార్గం. కేవలం 3 నిమిషాలు మాత్రమే ఈ వాకింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. దీని వల్ల సాధారణ జాగింగ్ కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయిని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఈ ప్రత్యేకమైన వాకింగ్ విధానం ఎలా పనిచేస్తుంది, దీని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


3-నిమిషాల వాకింగ్ విధానం:
ఈ విధానంలో ఒక సెషన్ సాధారణంగా 3 నిమిషాల పాటు సాగుతుంది. ఈ 3 నిమిషాలను రెండు భాగాలుగా విభజించాలి.

30 సెకన్లు ‘ఫాస్ట్ వాక్’: ఈ సమయంలో మీరు మీరు నడవగిలిగే గరిష్ట వేగంతో (శక్తిలో 70% కంటే ఎక్కువ) నడవాలి. మీరు కొంచెం ఆయాసపడాలి. మాట్లాడటానికి కష్టపడాలి, మీకు చెమట పట్టడం మొదలవ్వాలి.


2.5 నిమిషాలు ‘స్లో వాక్’ : ఈ వాకింగ్‌లో మీరు మీ సాధారణ వేగంతో (శక్తిలో 40% కంటే తక్కువ) నెమ్మదిగా నడవాలి. ఇది కేవలం మీ శ్వాస, కండరాలను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది.

ఈ 3 నిమిషాల విధానాన్ని ఒక రౌండ్‌గా పరిగణించాలి. మీ ఫిట్‌నెస్ స్థాయిని బట్టి రోజుకు 5 నుంచి 10 రౌండ్లు (మొత్తం 15-30 నిమిషాలు) చేయాడం మంచిది. ఉత్తమ ఫలితాల కోసం.. ఈ ఇంటర్వెల్ వాకింగ్‌ను వారంలో కనీసం 4 రోజులు చేయడం చాలా మంచిది.

జాగింగ్ కంటే మెరుగైన ప్రయోజనాలు:
సాధారణంగా.. జాగింగ్ అధిక కీళ్ల ఒత్తిడికి కారణమవుతుంది. ముఖ్యంగా మోకాళ్లు, చీలమండల సమస్యలు ఉన్నవారికి. అయితే.. ఇంటర్వెల్ వాకింగ్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ముఖ్యంగా మధ్య వయస్కులు, వృద్ధులకు. పరిశోధనల ప్రకారం.. ఈ విధానాన్ని 5 నెలలు క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

గుండె ఆరోగ్యం మెరుగుదల: గుండె పనితీరు మరియు రక్తపోటు గణనీయంగా మెరుగు పడతాయి.

కండరాల బలం పెరుగుదల: ముఖ్యంగా కాళ్ళ కండరాల బలం 13% వరకు పెరుగుతుంది. ఇది పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read: మేక పాలు తాగితే.. మతిపోయే లాభాలు, తెలిస్తే అస్సలు వదలరు !

జీవక్రియ నియంత్రణ: అధిక కేలరీలను ఖర్చు చేయడం ద్వారా.. ఇది బరువు తగ్గడానికి అంతే కాకుంవడా మధుమేహం వంటి జీవక్రియ రుగ్మతలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యం: డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి. అంతే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.

తక్కువ గాయాల ప్రమాదం: ఇది పరిగెత్తడం కంటే కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా గాయాల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ఇంటర్వెల్ వాకింగ్ అనేది సమర్థవంతమైన, సురక్షితమైన, సులభంగా ఆచరించదగిన వ్యాయామ పద్ధతి. కేవలం 30 నిమిషాల రోజువారీ నడకలో 5 సార్లు వేగంగా నడవడానికి ప్రయత్నించడం ద్వారా, మీరు జాగింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను కీళ్లపై ఒత్తిడి లేకుండా పొందవచ్చు. మీ దినచర్యలో ఈ 3-నిమిషాల జపనీస్ నడకను చేర్చడం ద్వారా ఆరోగ్యకరమైన చురుకైన జీవితాన్ని గడపండి.

Related News

Walk With Friend: ఫ్రెండ్‌తో కలిసి నడిస్తే.. ఇలా జరుగుతుందా? చాలా మిస్ అవుతున్నారు బ్రో !

Hyderabad: లాంఛనంగా ప్రారంభమైన “ది హౌస్ ఆఫ్ కోయిలా”.. అతిథులు వీరే!

Velaterapia: జుట్టుకు మంటలు.. ఇదేం మాయదారి ట్రెండ్ రా? ఇది ఏ దేశంలో మొదలైందో తెలుసా?

Director Sukumar: హైదరాబాదులో సుకుమార్ సందడి.. ఘనంగా ప్రారంభోత్సవం!

Cetirizine: సెటిరిజిన్ మాత్ర తీసుకుంటే నిద్ర ఎందుకు వస్తుంది? ఇది సేఫేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

Glow Skin In One Day: ఇవి వాడితే.. ఒక్క రోజులోనే గ్లోయింగ్ స్కిన్

Blood Sugar: ఏంటీ.. టూత్ పేస్ట్‌‌తో షుగర్ పెరుగుతుందా ?

Big Stories

×