E-Paper
Advertisement

ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి..దొండకాయ ఉల్లికారం ఇలా ట్రై చేయండి!

ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి..దొండకాయ ఉల్లికారం ఇలా ట్రై చేయండి!
Advertisement

Dondakaya Ullikaram recipe: మన వంటకాల్లో..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ దొండకాయ కూర అంటే ఇష్టపడని వారు ఉండరు. సాధారణంగా చేసే.. దొండకాయ వేపుడు లేదా కూర కాకుండా, కొంచెం కారంకారంగా, ఘాటుగా ఉండేలా ఏదైనా ట్రై చేయాలనుకుంటే “దొండకాయ ఉల్లికారం”బెస్ట్. వేడి వేడి అన్నం,చపాతీలోకి ఇది నంజుకోవడానికి చాలా బాగుంటుంది. ఉల్లిపాయల సువాసన, మసాలాల ఘాటు దొండకాయ ముక్కలకు బాగా పట్టి ఈ కూరను మరింత రుచికరంగా మారుస్తాయి. అతి తక్కువ పదార్థాలతో, ఈజీగా ఇంట్లోనే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

దొండకాయలు: అర కేజీ

Advertisement

ఉల్లిపాయలు: 3 పెద్దవి

ఎండుమిర్చి: 5 లేదా 6

Advertisement

వెల్లుల్లి రెబ్బలు: 8 నుంచి 10

జీలకర్ర: 1 టీస్పూన్

ధనియాలు: 1 టేబుల్ స్పూన్

పసుపు: అర టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: కూర తయారీకి తగినంత

కరివేపాకు: రెండు రెమ్మలు

కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం:

1. మొదటగా మిక్సీ జార్ తీసుకొని అందులో.. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా ఉప్పు వేయాలి. దీనిని నీళ్లు పోయకుండా.. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ ఉల్లికారమే కూరకి అసలైన రుచిని ఇస్తుంది. ఇప్పుడు తాజా దొండ కాయలను తీసుకుని నీటిలో కడగాలి.తర్వాత నిలువుగా నాలుగు ముక్కలుగా (కింద భాగం కట్ అవ్వకుండా పూర్తిగా విడిపోకుండా) కోసుకోవాలి. ఇలా కోయడం వల్ల మనం తయారు చేసుకున్న ఉల్లికారం ముక్కల లోపలికి వెళ్తుంది.

Also Read: నోరూరించే క్రిస్పీ వంకాయ వేపుడు..ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!

2.స్టవ్ వెలిగించి పయాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి పోపు వేయించాలి. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను నూనెలో వేయాలి. దొండ కాయ ముక్కలు పచ్చి వాసన పోయి, మెత్తబడే వరకు మీడియం మంటపై.. నూనెలో మగ్గనివ్వాలి. దొండకాయలు సరిగ్గా ఉడికి తేనే కూర టేస్ట్ బాగుంటుంది.

3. దొండకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్‌ను అందులో కలపాలి. పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లికారం పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలే వరకు సుమారు 5 నుంచి 8 నిమిషాల పాటు తక్కువ మంటపై మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఉల్లికారం బాగా వేగి, దొండకాయ ముక్కలకు పూర్తిగా పట్టిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దించేయాలి. అంతే.. రుచికరమైన “దొండకాయ ఉల్లికారం” రెడీ!

Related News

అమ్మమ్మ నాటి రుచితో పర్ఫెక్ట్ బెల్లం గవ్వలు..ఒక్కసారి ఇలా ట్రై చేయండి

చలికాలంలో ఏ పిండి రొట్టెలు తింటే మంచిది? సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు లేదా..

మనుషుల కంటే కాకులు డబుల్ ఫాస్ట్.. ఆ విషయంలో యమ స్పీడ్

తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెబుతారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు చాలా మొండివారు

భగవద్గీత.. ఓటమి, బాధ, నిరాశ.. వీటిని అధిగమించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం

రాత్రిపూట ఇలా వదిలేయడం వల్లే.. ఉదయానికల్లా పెరుగు పులిసిపోతుంది!

నెయ్యి సువాసనతో అదిరిపోయే పెసరపప్పు హల్వా.. ఇలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది!

Big Stories

Advertisement
×