E-Paper
Advertisement

నాడు చదువుకు పండుగ.. నేడు దండుగ.. ఫీజు బకాయిలపై వైఎస్ షర్మిల ధ్వజం

నాడు చదువుకు పండుగ.. నేడు దండుగ.. ఫీజు బకాయిలపై వైఎస్ షర్మిల ధ్వజం
Advertisement

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాడు వైఎస్సార్ హయాంలో పేదవాడి చదువుకు పండుగలా ఉన్న ఈ పథకం, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో వేల కోట్ల బకాయిలతో దండుగలా మారిందని ఆమె ఆరోపించారు.

హామీల అమలుపై నిలదీత

Advertisement

ఓవైపు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని భారీ ప్రచారాలు చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు పేద విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించడంలో విఫలమవుతోందని షర్మిల విమర్శించారు. గత మూడేళ్లుగా రూ. 6 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం విద్యార్థుల చదువుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఆమె పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బకాయిలన్నీ క్లియర్ చేస్తామని, నేరుగా కాలేజీల ఖాతాల్లోకే నిధులు జమ చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలపై ఆందోళన

Advertisement

ఫీజుల చెల్లింపుల కోసం కాలేజీల చుట్టూ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని, వారి భవిష్యత్తు దారణం మారిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల ఒత్తిడి తట్టుకోలేక చిత్తూరు వంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం అత్యంత బాధాకరమని తెలిపారు. ఇంత జరుగుతున్నా తప్పు ఫీజు బకాయిలది కాదని, ప్రభుత్వానికి సంబంధం లేదని సాకులు చెప్పడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఆమె వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని హితవు పలుకుతూ.. ఏపీ కాంగ్రెస్ పక్షాన షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఐదు డిమాండ్లను ఉంచారు. తక్షణం బకాయి పడిన రూ. 6,400 కోట్లను ఒకే విడతలో విడుదల చేయాలని కోరారు. సర్టిఫికెట్ల నిలిపివేతపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు ఎలాంటి షరతులు లేకుండా సర్టిఫికెట్లు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థులు, తల్లిదండ్రులపై వేధింపులను అరికట్టేందుకు కాలేజీలపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఎలాంటి లోటు లేకుండా నిధులు కేటాయించాలని ఆమె స్పష్టం చేశారు.

Also Read: అనకాపల్లి జిల్లాలో విషాదం.. శారదా నదిలో గల్లంతైన ఇద్దరు రైతులు

Tags

Related News

అలాంటి వివక్ష తగదు.. ఉపాసనతో ఇంటర్వ్యూ- మంత్రి లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు

అనకాపల్లి జిల్లాలో విషాదం.. శారదా నదిలో గల్లంతైన ఇద్దరు రైతులు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి.. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

ఏపీలో పంచాయతీలకు బంపరాఫర్.. ఏకంగా రూ.50 లక్షలు సొంతం, ఇంకెందుకు ఆలస్యం?

సీఎం చంద్రబాబుతో మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ, వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు

ఏపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అంతర్మథనం.. ఆందోళనలో కమళ నాథులు!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ జనసేనలో అందరి కీలక పదవులన్నీ రద్దు!

Big Stories

Advertisement
×