E-Paper
Advertisement

మనుషుల కంటే కాకులు డబుల్ ఫాస్ట్.. ఆ విషయంలో యమ స్పీడ్

మనుషుల కంటే కాకులు డబుల్ ఫాస్ట్.. ఆ విషయంలో యమ స్పీడ్
Advertisement

Crow vs Humans| కాకులు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది వాటి తెలివితేటలే. ఆహారాన్ని సంపాదించుకోవడంలోనూ, సమస్యలను పరిష్కరించడంలోనూ ఇవి ఎంతో చురుగ్గా వ్యవహరిస్తాయి. అయితే కాకుల మెదడు సామర్థ్యం గురించి శాస్త్రవేత్తలు తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మనుషుల కంటే దాదాపు రెండింతలు వేగంగా కాకులు నిర్ణయాలు తీసుకోగలవని ఓ అధ్యయనంలో తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాలు కచ్చితంగా ఉండడం. అసలు కాకులకు ఇంత వేగంగా ఆలోచించే సామర్థ్యం ఎలా వచ్చింది? పరిశోధకులు ఏం గుర్తించారు? తెలుసుకుందాం.

కాకుల నిర్ణయాలు తీసుకునే వేగంపై పరిశోధన జరిగింది

జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింగెన్‌కు చెందిన న్యూరోబయాలజిస్టులు ఈ పరిశోధన నిర్వహించారు. ఫిలిప్ ష్మిడ్‌బౌర్, ఆండ్రియాస్ నీడర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు రెండు కారియన్ కాకులపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాకులు దృశ్య సమాచారాన్ని ఎంత వేగంగా గుర్తిస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రత్యేక ప్రయోగం చేశారు.

టచ్‌స్క్రీన్ ద్వారా కాకుల తెలివితేటల పరీక్ష

Advertisement

పరిశోధకులు రెండు కాకులకు టచ్‌స్క్రీన్‌పై కదులుతున్న చుక్కలను చూపించారు. ఆ చుక్కలు ఎడమవైపు కదులుతున్నాయా? కుడివైపు వెళ్తున్నాయా? అని గుర్తించాల్సి ఉండేది. కాకులు సరైన దిశను ఎంచుకున్న ప్రతిసారీ వాటికి ఆహారంగా మీల్‌వార్మ్స్ ఇచ్చారు. ఇలా వాటి నిర్ణయాలు తీసుకునే వేగాన్ని, కచ్చితత్వాన్ని పరిశీలించారు.

కేవలం 235 మిల్లీసెకన్లలోనే నిర్ణయం 

ఈ ప్రయోగంలో కాకులు సగటున కేవలం 235 మిల్లీసెకన్లలో నిర్ణయం తీసుకున్నాయి. అంటే సెకనులో నాలుగో వంతు సమయంలోనే తమ ఎంపికను వెల్లడించాయి.
ఈ వేగం మనుషుల కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, చుక్కల కదలికలను గుర్తించడం కష్టమైనప్పటికీ కాకులు సరైన నిర్ణయాలు తీసుకున్నాయి.
స్పష్టమైన దృశ్య సంకేతాలు కనిపించినప్పుడు వాటి కచ్చితత్వం దాదాపు 100 శాతంగా నమోదైంది. మధ్యలో ఇతర చుక్కలను చూపించి దృష్టి మళ్లించినప్పటికీ కాకులు మంచి పనితీరు కనబరిచాయి.

Advertisement

Also Read: లగ్జరీ డేట్‌కు వెళ్లిన యువతి.. ప్రపోజల్ తిరస్కరించగానే ఆమెకు గట్టిగా షాకిచ్చిన యువకుడు

కాకులకు ఇంత వేగంగా ఆలోచించే సామర్థ్యం ఎందుకు వచ్చింది?

కాకుల్లో ఈ ప్రత్యేక సామర్థ్యం పరిణామ క్రమంలో అభివృద్ధి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే పక్షులు ఎగురుతున్నప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటాయి. చుట్టుపక్కల పరిస్థితులను వేగంగా గుర్తించాలి. అడ్డంకులను తప్పించుకోవాలి. శత్రువుల నుంచి రక్షించుకోవాలి. అలాగే ఆహారాన్ని గుర్తించడానికి కూడా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కాకుల్లో ఈ సామర్థ్యం అభివృద్ధి చెంది ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Also Read: చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఫుడ్స్ తినాలి.. నవంబర్ నెలలో ఇవే బెస్ట్?

పక్షుల మెదడుపై కొత్త విషయాలను వెల్లడించిన అధ్యయనం

ఈ పరిశోధన పక్షుల మెదడు సామర్థ్యంపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మనుషుల మెదడుకు భిన్నమైన నిర్మాణం ఉన్నప్పటికీ పక్షులు కూడా సంక్లిష్టమైన సమాచారాన్ని అర్థం చేసుకోగలవని ఇది సూచిస్తోంది.
కాకులపై మరిన్ని పరిశోధనలు జరిగితే వాటి తెలివితేటలు, ఆలోచనా విధానం గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెబుతారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు చాలా మొండివారు

భగవద్గీత.. ఓటమి, బాధ, నిరాశ.. వీటిని అధిగమించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం

రాత్రిపూట ఇలా వదిలేయడం వల్లే.. ఉదయానికల్లా పెరుగు పులిసిపోతుంది!

నెయ్యి సువాసనతో అదిరిపోయే పెసరపప్పు హల్వా.. ఇలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది!

ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే వెజిటబుల్ దలియా.. రుచి అద్భుతం!

పాల ప్యాకెట్‌పై ‘పాశ్చరైజ్డ్’ అని ఉంటే అర్థం ఏంటి? ఇది తెలిస్తే ఇకపై పాలను మళ్లీ మరగబెట్టరు!

నోరూరించే క్రిస్పీ వంకాయ వేపుడు..ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!

Big Stories

Advertisement
×