Numerology Stubborn Kids| మీ పిల్లలు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారా? మీరు ఏదైనా చెప్పినా ఎదురు సమాధానం చెబుతున్నారా? కొందరు పిల్లలు చాలా ప్రశాంతంగా ఉంటే, మరికొందరు మాత్రం ప్రతి విషయానికీ త్వరగా కోపపడుతుంటారు. పిల్లల ప్రవర్తన వెనుక కుటుంబ వాతావరణం, పెంపకం, స్నేహితులు, వ్యక్తిగత అనుభవాలు వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే న్యూమరాలజీ ప్రకారం పిల్లలు పుట్టిన తేదీ కూడా వారి స్వభావంపై ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా మూడు ప్రత్యేక మూలాంకాలకు చెందిన పిల్లల్లో కోపం, మొండితనం ఎక్కువగా ఉంటాయి. మరి ఆ మూలాంకాలు ఏమిటి? ఈ పిల్లల స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 1 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యకు సూర్యుడు అధిపతి.
ఈ తేదీల్లో పుట్టిన పిల్లల్లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి విషయంలో తమ మాటే నెగ్గాలని కోరుకుంటారట. ఇతరులు తమ అభిప్రాయాలను వ్యతిరేకిస్తే వెంటనే అసహనం వ్యక్తం చేస్తారు.
తల్లిదండ్రులు తప్పులను సరిదిద్దినప్పుడు కూడా కొన్నిసార్లు కోపంగా స్పందిస్తారు. తమ తప్పును అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చని న్యూమరాలజీ వివరిస్తుంది. ఇలాంటి పిల్లలకు సహనం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్పించాలని సూచిస్తుంది.
4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 4 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యకు రాహువు అధిపతి. ఈ మూలాంకం పిల్లలు స్వతంత్రంగా ఆలోచించడానికి ఇష్టపడతారు. ఏదైనా విషయం అర్థం కాకపోతే ప్రశ్నిస్తారట. తమకు నచ్చని విషయాలను అంగీకరించడానికి కొన్నిసార్లు ఇష్టపడరు.
ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యతిరేకిస్తే మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు వీరితో ప్రశాంతంగా మాట్లాడి, ప్రతి విషయం వెనుక కారణాన్ని వివరించాలి.
Also Read: పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..
9, 18, 27 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 9 అవుతుంది. ఈ సంఖ్యకు కుజుడు అధిపతిగా ఉంటాడని న్యూమరాలజీ చెబుతుంది.
ఈ పిల్లలు ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే చిన్న చిన్న విషయాలకే త్వరగా కోపం తెచ్చుకుంటారు. తమ భావాలను బలంగా వ్యక్తపరుస్తూ కొన్నిసార్లు గొడవలకు దిగుతారు.
ఇంట్లోనే కాకుండా పాఠశాలలో, స్నేహితుల మధ్య కూడా ఇలాంటి ప్రవర్తన కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలను క్రీడలు, వ్యాయామం వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచిస్తారు.
న్యూమరాలజీ కొన్ని సంప్రదాయ నమ్మకాల ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను వివరిస్తుంది. అయితే పిల్లల స్వభావం వారి పుట్టిన తేదీపై మాత్రమే ఆధారపడదు. తల్లిదండ్రుల పెంపకం, కుటుంబ వాతావరణం, స్నేహితులు, వ్యక్తిగత అనుభవాలు కూడా ప్రభావం చూపుతాయి.
పిల్లలు కోపంగా ప్రవర్తించినప్పుడు వారిని నిందించడం కంటే, అందుకు గల కారణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
గమనిక: ఈ కథనం న్యూమరాలజీకి సంబంధించిన సంప్రదాయ నమ్మకాల ఆధారంగా రూపొందించబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.