E-Paper
Advertisement

అమ్మమ్మ నాటి రుచితో పర్ఫెక్ట్ బెల్లం గవ్వలు..ఒక్కసారి ఇలా ట్రై చేయండి

అమ్మమ్మ నాటి రుచితో పర్ఫెక్ట్ బెల్లం గవ్వలు..ఒక్కసారి ఇలా ట్రై చేయండి
Advertisement

Bellam Gavvalu Preparation: మన సంప్రదాయ వంటకాల్లో పిండి వంటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండగలు, లేదా ఇంట్లో ఎలాంటి వేడుకలు జరిగినా మన ముందు గుర్తుకు వచ్చేది పిండి వంటలు. ముఖ్యంగా బెల్లం గవ్వల రుచి ఎప్పటికీ ఎవరూ మరువలేనిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ బెల్లం గవ్వలను ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే.. చాలా మందికి ఇవి చేసేటప్పుడు సరిగ్గా.. రాక పోవడం, మెత్తగా అయిపోవడం లేదా పాకం ముదరడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ.. సరిగ్గా 1 కేజీ మైదాతో పక్కా కొలతలతో కరకరలాడే బెల్లం గవ్వలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

మైదా పిండి: 1 కేజీ

Advertisement

బెల్లం: 800 గ్రాములు

నూనె: సరిపడా

Advertisement

బటర్ లేదా నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు

ఉప్పు: చిటికెడు

యాలకుల పొడి: 1 టేబుల్ స్పూన్

నీరు: తగినంత

తయారీ విధానం:

1.గవ్వలు క్రిస్పీగా రావడంలో పిండి కలపడమే అత్యంత కీలకమైన భాగం.ఇందు కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో 1 కేజీ మైదా పిండిని తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు మరో గిన్నెలో.. 4 టేబుల్ స్పూన్ల నూనె , నెయ్యిని కొద్దిగా వేడి చేసి, ఆ గోరు వెచ్చని నూనెను మైదా పిండిలో పోయాలి. చేత్తో నూనె అంతా పిండికి బాగా పట్టేలా (మొత్తం పిండి ముద్దలా అయ్యే వరకు) కలుపుకోవాలి. ఈ దశలో.. పిండిని చేతిలో పట్టుకుంటే ముద్దలా అవ్వాలి. ఇది గవ్వలు గుల్లగా రావడానికి చాలా ముఖ్యం. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోస్తూ పూరీ పిండి కంటే.. కొద్దిగా గట్టిగా, చపాతీ పిండి లాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత తడి క్లాత్ కప్పి సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు నాననివ్వాలి.

Also Read: నోరూరించే క్రిస్పీ వంకాయ వేపుడు..ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!

2.నానిన పిండిని సమాన భాగాలుగా విడ దీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. గవ్వల చెక్క తీసుకొని, దానికి కొద్దిగా నూనె రాయాలి. తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని గవ్వల చెక్కపై పెట్టి, వేలితో.. కొద్దిగా నొక్కుతూ క్రిందికి దొర్లిస్తే గవ్వల ఆకారం వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని గవ్వలుగా చేసి ఒక పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె మీడియంగా కాగిన తర్వాత తయారు చేసుకున్న గవ్వలను వేసి మంటను మీడియం టూ లో ప్లేమ్ లో ఉంచాలి. గవ్వలు బంగారు రంగులోకి, క్రిస్పీగా మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

3.తర్వాత ఒక గిన్నెలో 800 గ్రాముల బెల్లం వేసి, అర కప్పు నీరు పోసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత మురికి పోవడానికి వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పాకాన్ని.. మళ్లీ స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. పాకం “తీగ పాకం” రావాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి, వేయించి పెట్టుకున్న గవ్వలను.. ఆ పాకంలో వేసి బాగా కలపాలి. పాకం గవ్వలకు పూర్తిగా పట్టి గట్టిపడే.. వరకూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చల్లారితే.. గుల్లగా ఉండే రుచి కరమైన బెల్లం గవ్వలు రెడీ అవుతాయి.

Related News

చలికాలంలో ఏ పిండి రొట్టెలు తింటే మంచిది? సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు లేదా..

మనుషుల కంటే కాకులు డబుల్ ఫాస్ట్.. ఆ విషయంలో యమ స్పీడ్

తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెబుతారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు చాలా మొండివారు

భగవద్గీత.. ఓటమి, బాధ, నిరాశ.. వీటిని అధిగమించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం

రాత్రిపూట ఇలా వదిలేయడం వల్లే.. ఉదయానికల్లా పెరుగు పులిసిపోతుంది!

నెయ్యి సువాసనతో అదిరిపోయే పెసరపప్పు హల్వా.. ఇలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది!

ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే వెజిటబుల్ దలియా.. రుచి అద్భుతం!

Big Stories

Advertisement
×