E-Paper
Advertisement

రాత్రిపూట ఇలా వదిలేయడం వల్లే.. ఉదయానికల్లా పెరుగు పులిసిపోతుంది!

రాత్రిపూట ఇలా వదిలేయడం వల్లే.. ఉదయానికల్లా పెరుగు పులిసిపోతుంది!
Advertisement

Homemade Curd: ఇంట్లో పెరుగు తోడుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తుంది. పాలను కాచి, గోరువెచ్చగా అయ్యాక కాస్త తోడు వేసి రాత్రంతా వదిలేస్తే చాలు, ఉదయానికల్లా కమ్మని పెరుగు సిద్ధమైపోతుందని అందరం అనుకుంటాం. కానీ తీరా ఉదయం లేచి మూత తీసి చూస్తే.. ఒక్కోసారి పెరుగు నోట్లో పెట్టుకోలేనంత పుల్లగా మారిపోతుంది, లేదంటే నీళ్లు విడిపోయి పల్చగా ఉంటుంది, ఇంకొన్నిసార్లు అసలు తోడుకోనే తోడుకోదు.

నిజానికి దీనికి కారణం మనం వాడే పాలు, తోడు పెరుగు మోతాదు, గదిలో ఉండే వేడి, ఇంకా మనం ఉంచే సమయమే. తోడు వేసే ముందు గిన్నె శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవడం దగ్గరి నుంచి.. త్వరగా తోడుకోవాలని మరీ ఎక్కువ తోడు వేయకుండా సరైన మోతాదులో వేయడం వరకు కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే గడ్డలాంటి, కమ్మని పెరుగును సులభంగా తోడుపెట్టుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

పాలను సరిగ్గా కాచాలి:

Advertisement

ముందుగా పచ్చి పాలను బాగా మరిగించాలి. పాలు పొంగిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి మరో రెండు మూడు నిమిషాలు ఉంచితే అదనపు నీరు ఆవిరై, పెరుగు గడ్డలా చిక్కగా వస్తుంది. ఆ తర్వాత పాలను వేరే గిన్నెలోకి పోసి చల్లారనివ్వాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పాలు మరీ వేడిగా ఉండకూడదు, అలాగని పూర్తిగా చల్లారిపోకూడదు. వేలు పెట్టి చూస్తే గోరువెచ్చగా తగిలే స్థితి కరెక్ట్. వేడి ఎక్కువైతే తోడులోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది, మరీ చల్లగా ఉంటే పెరుగు తోడుకోవడానికి చాలా సమయం పడుతుంది.

తోడు మోతాదు ముఖ్యం:

అర లీటరు పాలకు ఒకటి లేదా రెండు టీస్పూన్ల తాజా పెరుగు వేస్తే సరిపోతుంది. మనం వేసే తోడు పెరుగు పాతదైనా, పుల్లగా ఉన్నా.. కొత్తగా తోడుకునే పెరుగు కూడా అలాగే పుల్లగా మారుతుంది. కాబట్టి.. ఎప్పుడూ కమ్మని పెరుగునే తోడుగా వాడండి. నేరుగా పాలలో వేయకుండా, ఒక చిన్న గిన్నెలో తోడు పెరుగు తీసుకుని అందులో కాస్త గోరువెచ్చని పాలు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాలలో వేసి ఒక్కసారి నెమ్మదిగా తిప్పితే చాలు, మరీ ఎక్కువగా గిలక్కొట్టాల్సిన పనిలేదు.

Advertisement

Also Read: నెయ్యి సువాసనతో అదిరిపోయే పెసరపప్పు హల్వా.. ఇలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది!

వేడిని బట్టి సమయం:

పెరుగులోని మంచి బ్యాక్టీరియా పాలలోని లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మార్చడం వల్లే పెరుగు తయారవుతుంది. అయితే వేసవిలో లేదా వంటగదిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగిపోతుంది. అందుకే రాత్రంతా అలా వదిలేస్తే ఉదయానికల్లా పెరుగు అవసరానికి మించి పులిసిపోతుంది. వేడి రోజుల్లో తోడుపెట్టిన 6 నుంచి 8 గంటల మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అదే చలికాలంలో అయితే తోడుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.

తోడుకున్నాక ఫ్రిజ్‌లో పెట్టేయండి:

పెరుగు గడ్డలా తోడుకున్న వెంటనే బయట ఉంచకుండా ఫ్రిజ్‌లో పెట్టేయాలి. బయటే ఎక్కువసేపు వదిలేస్తే అందులో పులుపు పెరుగుతూనే ఉంటుంది. అలాగే పెరుగు తోడుపెట్టిన గిన్నెకు గాలి చొరబడకుండా మూత పెట్టాలి, దాన్ని మాటిమాటికి కదపకుండా ఒకే చోట ఉంచితే నీళ్లు విడిపోకుండా ఉంటుంది. మరుసటి రోజు తినేటప్పుడు కూడా గిన్నె మొత్తాన్ని బయట పెట్టకుండా, కావాల్సినంత పెరుగును మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకుని మిగతాది ఫ్రిజ్‌లోనే ఉంచాలి. ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రతిసారీ కమ్మని గడ్డ పెరుగును ఆస్వాదించొచ్చు.

Also Read: ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే వెజిటబుల్ దలియా.. రుచి అద్భుతం!

Tags

Related News

నెయ్యి సువాసనతో అదిరిపోయే పెసరపప్పు హల్వా.. ఇలా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది!

ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే వెజిటబుల్ దలియా.. రుచి అద్భుతం!

పాల ప్యాకెట్‌పై ‘పాశ్చరైజ్డ్’ అని ఉంటే అర్థం ఏంటి? ఇది తెలిస్తే ఇకపై పాలను మళ్లీ మరగబెట్టరు!

నోరూరించే క్రిస్పీ వంకాయ వేపుడు..ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!

Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి రోజున ఈ శుభ సమయంలో దీపం వెలిగిస్తే సకల శుభాలు మీవే!

విలేజ్ స్టైల్ ఎండు నేతళ్ళు కోడిగుడ్ల కూర..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

నోరూరించే రుచితో క్యాబేజీ రోటి పచ్చడి..క్షణాల్లోనే రెడీ అవుతుంది!

Big Stories

Advertisement
×