BigTV English

Cold Water Side Effects : సమ్మర్ అని ఐస్ వాటర్ తాగేస్తున్నారా..? ఒక్క సారి ఆలోచించండి!

Cold Water Side Effects : సమ్మర్ అని ఐస్ వాటర్ తాగేస్తున్నారా..? ఒక్క సారి ఆలోచించండి!

Side effects of drinking cold water in Summer: ఇంకా మార్చి నెల రాకుండానే వేడి సెగ మొదలైంది. రాత్రి పూట ఫ్యాన్ లు, ఏసీలు లేనిదే నిద్రపోలేని పరిస్థితి వచ్చేసింది. వేసవి కాలంలో ఎంత నీరు త్రాగినా దాహం తీరదు. అయితే చాలా మంది దాహం తీర్చుకునేందుకు చల్లటి నీరు, శీతల పానీయాలు.. తీసుకుంటారు. కానీ చల్లటి నీరు మీ దాహాన్ని తీర్చినప్పటికి.. అది ఎంత హానికరమో అన్న విషయం మీకు తెలుసా? చల్లటి నీళ్లు లేదా ఇతర పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే కొన్ని అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


జీర్ణ క్రియ సమస్యలు
చల్లటి నీరు కడుపుని సంకోచింప చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. చల్లటి నీరు జీర్ణ వ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది.

హార్ట రేట్ తగ్గిపోతుంది
కొన్ని అధ్యయనాల ప్రకారం చల్లటి నీరు త్రాగడం వల్లన గుండె స్పందన రేటు తగ్గిపోతుంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడి మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ నాడీ శరీరం స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. అందుకే చల్లగా తిన్నా, తాగినా హార్ట్ రేట్ ప్రభావిత మవుతుంది.


సైనస్,తలనొప్పి
అతి చల్లగా త్రాగడం వల్ల కూడా “బ్రెయిన్ ఫ్రీజ్” సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకుంటే, వెన్నెముకకు సంబంధించిన సున్నితమైన నరాలు కూడా చల్లగా అయిపోతాయి. ఫలితంగా సైనస్, తలనొప్పి సమస్యలొస్తాయి.

Read more:తులసి ఆకులను తినండి.. కొలెస్ట్రాల్‌‌‌‌‌‌‌‌‌ సులభంగా కరుగుతుంది..!

మలబద్ధకం
చల్లటి నీరు త్రాగడం వల్ల పేగుల్లో ఆహారం గడ్డకడుతుంది. దీంతో మలబద్ధకం, కడుపు నొప్పి, వికారం, వంటి సమస్యలొస్తాయి.

కొవ్వును పెంచుతుంది.
చల్లని నీరు త్రాగడం వల్ల శరీరం లోని క్రొవ్వును మరింత గడ్డ కట్టేలా చేస్తుంది. ఒక పట్టాన కరగదు కూడా సో.. బరువు తగ్గాలనుకునే వారు చల్లని నీటికి దూరంగా ఉండాల్సిందే.

గొంతు నొప్పి
పానీయాలు,చల్లటి నీటి వల్ల ముఖ్యంగా భోజనం తర్వాత, అదనపు శ్లేష్మం ఏర్పడటానికి దారితీస్తుంది. దీని వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడం సమస్యలు వస్తాయి.

అంతే కాదు చల్లటి నీరు త్రాగడం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కుండలోని నీళ్లు త్రాగడం మంచిది. కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×