Lenovo Black Friday Deals 2026: చూస్తుండగానే నవంబర్ వచ్చేసింది.. అంటే అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ హడావుడి మొదలైపోయినట్టే. ఈ ఏడాది లెనోవో బ్లాక్ ఫ్రైడే సేల్‌లో క్రేజీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ పీసీలు, మానిటర్లు, ట్యాబ్లెట్లు ఇలా ప్రతి ఒక్క దాని మీద భారీగా తగ్గింపు ఉంది. అక్టోబర్ చివర్లోనే ఈ ఆఫర్లు వచ్చేయడంతో టెక్ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడీ సేల్‌లో ఏయే వస్తువులపై ఎంత తగ్గింపు లభిస్తుందో చూద్దాం..
ఈ సేల్‌లో కేవలం రూ.550కే లెనోవో సెలెక్ట్ వైర్లెస్ మౌస్ లభిస్తోంది. దీని అసలు ధర రూ.1,700 పైగానే ఉంటుంది. అయితే 68 శాతం డిస్కౌంట్‌తో దీనిని సొంతం చేసుకోవచ్చు. ఇక చదువుకునే పిల్లలు, సాధారణ ఆఫీస్ పనుల కోసం ఐడియాప్యాడ్ స్లిమ్ 3ఐ ల్యాప్‌టాప్ రూ.29,700 ధరకే వచ్చేస్తోంది. అలాగే రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడే లెనోవో సెలెక్ట్ టార్గస్ బ్యాక్‌ప్యాక్ రూ.1,100కే వస్తోంది.
Also Read: స్పీకర్ నుంచి స్మార్ట్‌వాచ్ వరకు అన్నీ ఆఫర్లో.. రూ.3,000 లోపు బెస్ట్ దీపావళి గిఫ్ట్స్ మీ కోసం!
గేమింగ్ అంటే ఇష్టపడే వారి కోసం లెనోవోLegion సిరీస్ ల్యాప్‌టాప్‌లు అద్భుతమైన ఆఫర్లలో ఉన్నాయి. ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్స్‌తో వచ్చే లెజియన్ 5 ల్యాప్‌టాప్ సుమారు రూ.93,500కి అందుబాటులో ఉంది. ఇంకా కొంచెం హై-ఎండ్ పెర్ఫార్మెన్స్, ఆర్టీఎక్స్ 5070 గ్రాఫిక్స్ కావాలనుకునే వారికి Legion 5i ల్యాప్‌టాప్ రూ.1,19,000 ధరలో లభిస్తోంది. గేమింగ్, గ్రాఫిక్స్ హెవీ వర్క్స్ చేసుకునే వాళ్లకు ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పవచ్చు.
ఆఫీస్ పని ఎక్కువగా ఉండే ప్రొఫెషనల్స్ కోసం ThinkPad X1 Carbon Gen 13 ల్యాప్‌టాప్ రూ.1,29,500కి ఇస్తున్నారు. దీని అసలు విలువ రూ.2,56,000 పైనే ఉంటుంది. అంటే దాదాపు సగం ధరకే వస్తోందన్నమాట. ఇక పెద్ద స్క్రీన్ మీద పనిచేసుకోవడానికి వీలుగా Think Vision 23.8 ఇంచుల మానిటర్ కేవలం రూ.7,500కే వస్తోంది. ఆన్లైన్ క్లాసులు, చదువుకోసం ఒక చిన్న ట్యాబ్ చూస్తున్నట్లయితే రూ.10,200 ధరలో Lenovo IdeaTab కూడా అందుబాటులో ఉంది.
ఇన్ని రకాల ఆఫర్లు ఉన్నప్పుడు మన అవసరం ఏంటో చూసుకొని కొనడం చాలా ముఖ్యం. గేమింగ్ కావాలా, ఆఫీస్ పనులా లేక సింపుల్ బ్రౌజింగా అనేది డిసైడ్ అవ్వండి. సేల్ సమయంలో స్టాక్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి.. అసలు ధరలు, ఆఫర్ నిబంధనలు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని చెక్అవుట్ చేయడం మంచిది.
Also Read: 40 గంటల బ్యాటరీ బ్యాకప్.. ఫ్రీ గానా సబ్‌స్క్రిప్షన్‌తో Noise Buds R1 Gaana Edition లాంచ్!