Sreemukhi Marriage: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ శ్రీముఖి(Anchor Sreemukhi) ఒకరు. ఇటీవల యాంకర్ గా స్టార్ మాలో ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలకు ఈమె యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా శ్రీముఖి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే స్టార్ మా లో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం(Aadivaram with Star Maa Parivaram) కార్యక్రమానికి చాలా మంచి క్రేజ్ లభించింది.
ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తుంది. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. అయితే ఈ ఎపిసోడ్ రెట్రో స్పెషల్ కావడంతో అందరూ కూడా ఓల్డ్ గెటప్స్ లో సందడి చేశారు. అయితే శ్రీముఖి ఈ కార్యక్రమంలో భాగంగా వారి చిన్నప్పటి ఫోటోలను స్క్రీన్ పై చూయిస్తూ మీరు వారికి కెరియర్ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు అంటూ కొంతమంది ఫోటోలను చూపించారు.
ఈ టాస్క్ లో శ్రీముఖి మొట్టమొదటిగా తన చిన్ననాటి ఫోటోని స్క్రీన్ పై వేయడంతో వెంటనే కార్తీకదీపం సీరియల్ తో ఎంతో ఫేమస్ అయిన నటుడు నిరుపమ్ పరిటాల(Nirupam Paritala) శ్రీముఖి చిన్ననాటి ఫోటోని చూసి వెంటనే గుర్తుపట్టి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటూ పరోక్షంగా శ్రీముఖికి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీముఖి మూడు పదుల వయసులోకి అడుగుపెట్టారు అయినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండడంతో ఆమెకు సరైన వయసులోనే పెళ్లి చేసుకోమని ఈ సందర్భంగా డాక్టర్ బాబు సలహా ఇవ్వటం గమనార్హం.
ఇక ఈ ఫోటోలో శ్రీముఖి చిన్నప్పుడు టీవీ పక్కన కూర్చోవడంతో వెంటనే ఎక్స్ప్రెస్ హరి స్పందిస్తూ నువ్వు చిన్నప్పుడే టీవీ పక్కన కూర్చున్నావు ఇప్పుడు కూడా టీవీలోనే ఉన్నావు అంటూ తనపై సెటైర్ వేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి పెళ్లి(Sreemukhi Marriage) గురించి ప్రస్తావనకు రావడంతో ఈమె పెళ్లి ఎప్పుడనే అంశంపై మరోసారి చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ ఏడాది శ్రీముఖి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఇంతవరకు శ్రీముఖి మాత్రం ఈ వార్తల పట్ల ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.
Also Read: డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..నా వల్ల కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ!