Makeup Removal Tips:మీరు ఒక ఫంక్షన్, పార్టీ లేదా పెళ్లి కోసం ఎక్కువగా మేకప్ వేసుకుంటే.. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మేకప్‌ను పూర్తిగా శుభ్రం తీసివేయడం. కానీ చాలా మంది అలసట లేదా సోమరితనం కారణంగా మేకప్ తొలగించకుండానే నిద్రపోతారు. ఇది చర్మానికి చాలా హానికరం.
మేకప్ ఎంత బ్రాండెడ్ అయినా, రాత్రిపూట మేకప్ వేసుకున్న తర్వాత సరిగ్గా శుభ్రం చేయకపోతే, అది ముఖ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఇది చర్మం శ్వాస తీసుకోకుండా నిరోధిస్తుంది. ఫౌండేషన్, కన్సీలర్, మ్యాట్ లిప్‌స్టిక్ , వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తుల వంటి వాటిని తొందరగా తొలగించడం అవసరం.
మేకప్ తొలగించడానికి చిట్కాలు:
మేకప్ రిమూవర్ లేదా మైకెల్లార్ వాటర్ :
ముందుగా.. వాటర్ ప్రూఫ్ , హెవీ మేకప్ తొలగించడానికి మంచి నాణ్యత ఉన్న మేకప్ రిమూవర్ లేదా మైకెల్లార్ వాటర్ తీసుకోండి. కాస్త కాటన్ తీసుకుని దాని మీద కొద్దిగా మేకప్ రిమూవర్ తీసుకొని ముఖం, కళ్ళు, పెదవుల నుండి మేకప్ ను సున్నితంగా తుడవండి. రుద్దకండి.. సున్నితంగా మాత్రమే తుడవండి.
డబుల్ క్లెన్సింగ్ :
ముందుగా మేకప్ రిమూవర్‌తో మేకప్ తొలగించి.. ఆపై మీ ముఖాన్ని సున్నితమైన ఫేస్ వాష్‌తో కడగాలి. దీనిని “డబుల్ క్లెన్సింగ్” అంటారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఆయిలీ మేకప్ ను తొలగించడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
కళ్ళు, పెదవులు:
కళ్ళు ,పెదవులపై ఉపయోగించే ప్రొడక్ట్స్ మరింత జిగటగా, గట్టిగా ఉంటాయి. దీని కోసం.. కంటి మేకప్ రిమూవర్ లేదా కొబ్బరి నూనెను ఉపయోగించండి. సున్నితమైన చర్మం దెబ్బతినకుండా కాటన్‌తో సున్నితంగా శుభ్రం చేయండి.
కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ :
మీ దగ్గర మేకప్ రిమూవర్ లేకపోతే.. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వాడండి. ఈ సహజ నూనెలు మేకప్‌ను మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా చర్మానికి తేమను అందిస్తాయి.
Also Read: కిచెన్ సింక్ నుంచి దుర్వాసన వస్తోందా ? ఈ టిప్స్ తప్పక పాటించండి
చర్మాన్ని టోన్ చేయడం, మాయిశ్చరైజ్ చేయడం :
మేకప్ తీసేసిన తర్వాత.. టోనర్ తో రంధ్రాలను మూసివేసి, తేలికపాటి మాయిశ్చరైజర్ రాయండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా అది చర్మానికి హాని కలిగించకుండా ఉపయోగపడుతుంది.
వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేయండి:
హెవీ మేకప్ ప్రభావం క్రమంగా చర్మంపై కనిపిస్తుంది. కాబట్టి.. వారానికి ఒకసారి డీప్ క్లెన్సింగ్ ఫేస్ మాస్క్ లేదా స్క్రబ్ ఉపయోగించండి. అంతే కాకుండా తద్వారా చర్మం పూర్తిగా తాజాగా ఉంటుంది.