Sink Cleaning Tips: కిచెన్ సింక్ అంటే ప్రతిరోజూ పాత్రలు కడగడం, వంట చేసిన తర్వాత శుభ్రం చేయడం , నీటిని ఎక్కువగా ఉపయోగించడం వంటివి గుర్తుకువస్తాయి. కానీ చాలా మంది సింక్ శుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపరు. దీని కారణంగా అక్కడ బ్యాక్టీరియా, మరకలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా దుర్వాసన కూడా వస్తుంది. అంతే కాకుండా మురికిగా ఉండే సింక్ మొత్తం వంటగది శుభ్రతను కూడా ప్రభావితం చేస్తుంది.
కానీ మీ కిచెన్ సింక్ ఎల్లప్పుడూ మెరుస్తూ, శుభ్రంగా ఉండాలని మీరు కోరుకుంటే మాత్రం కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు సింక్‌ను క్రిములు లేకుండా ఉంచడమే కాకుండా.. దానిని కొత్తగా మెరిసేలా చేయవచ్చు.
కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి 5 చిట్కాలు:
బేకింగ్ సోడా, నిమ్మరసంతో డీప్ క్లీనింగ్ :
బేకింగ్ సోడా , నిమ్మరసం మిశ్రమాన్ని సింక్ శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నిమ్మరసం సింక్ యొక్క వాసనను తొలగిస్తుంది. ముందుగా మురికిగా లేదా వాసన వస్తున్న సింక్ లో బేకింగ్ సోడా చల్లి దానిపై నిమ్మకాయతో రుద్దండి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇది సింక్‌ను మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా దుర్వాసన రాకుండా చేస్తుంది.
వెనిగర్, గోరువెచ్చని నీటిని ఉపయోగించండి:
సింక్ నుండి దుర్వాసన వస్తుంటే.. వెనిగర్, వేడి నీటిని వాడండి. ఇవి సింక్ ను తెల్లగా మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ఇవి బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తాయి. ఇందుకోసం మీరు 1 కప్పు వైట్ వెనిగర్‌ను సింక్‌లో పోసి 10 నిమిషాల తర్వాత వేడి నీటితో ఫ్లష్ చేయండి. ఈ చిట్కా సింక్ పైపులను శుభ్రం చేయడంలో , పేరుకుపోయిన మురికిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
ప్రతిరోజూ లిక్విడ్ తో శుభ్రం చేయండి:
ప్రతిరోజూ పాత్రలు కడిగిన తర్వాత.. సింక్‌ను డిష్ వాషింగ్ లిక్విడ్‌తో శుభ్రం చేయాలి. ఇది నూనె , ఆహార కణాలను తొలగిస్తుంది . అంతే కాకుండా మురికి పేరుకుపోకుండా నిరోధిస్తుంది. పాత స్పాంజితో సింక్ ఉపరితలాన్ని సున్నితంగా శుభ్రం చేసి.. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
వారానికి ఒకసారి బ్లీచ్ వాడండి:
బ్లీచ్ అనేది బ్యాక్టీరియా , ఫంగస్‌ను చంపే బలమైన క్లీనర్. వారానికి ఒకసారి.. నీటిలో కొద్ది మొత్తంలో బ్లీచ్ కలిపి సింక్‌లో పోసి 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. గుర్తుంచుకోండి. దీనిని ఉపయోగించేటప్పుడు గ్లౌజ్ లను ఉపయోగించండి. సింక్ ఉన్న చోట కూడా మంచి వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.
Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది తెలుసా ?
సింక్ ను కూడా శుభ్రంగా ఉంచండి:
ఆహారం తరచుగా సింక్ డ్రెయిన్‌లో పేరుకుపోతుంది. దీనివల్ల చెడు వాసన వస్తుంది. అంతే కాకుండా సింక్ కూడా మూసుకుపోతుంది. వారానికి ఒకసారి డ్రెయిన్ క్లీనర్ లేదా బేకింగ్ సోడా , వెనిగర్ ఉపయోగించండి. దానిని సింక్ లో పోసి, కొద్దిసేపు అలాగే ఉంచి, తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా సింక్ నుండి చెడు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా సింక్ తెల్లగా మెరిసిపోవాలన్నా అంతే కాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా ఈ హోం రెమెడీస్ వాడటం చాలా ముఖ్యం.