Singer Mangli :ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఫోక్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న మంగ్లీ(Singer Mangli) తన బర్తడే సందర్భంగా పలువురు స్నేహితులకు హైదరాబాదులో చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో పార్టీ ఇచ్చింది. అయితే ఈ పార్టీలో మాదకద్రవ్యాలు ఉపయోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. వెంటనే త్రిపుర రిసార్ట్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పోలీసులు భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో పలువురికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
9 మందికి పాజిటివ్..
తాజాగా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. త్రిపుర రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అయితే ఈ ఇక్కడ భారీగా విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. అంతే కాదు 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పార్టీ నిర్వహకులపై పోలీసులు NDPS యాక్టర్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మంగ్లీ పై కూడా కేసు నమోదు..
ఇకపోతే పోలీసులు రైడ్ నిర్వహించగా.. రెస్టారెంట్ నిర్వాహకులతో పాటు మంగ్లీ పై కూడా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే ఇలా గంజాయి పాజిటివ్ వచ్చింది అంటూ 9 మందిని గుర్తించిన పోలీసులు.. ఆ తొమ్మిది మందిలో మంగ్లీ ఉన్నారా? లేదా ?అన్న విషయం ఇంకా తెలియలేదు. త్వరలోనే ఈ విషయం కూడా బయటపడే అవకాశం ఉంది.
సింగర్ మంగ్లీ కెరియర్..
సింగర్ మంగ్లీ కెరియర్ విషయానికి వస్తే.. టీవీ వ్యాఖ్యాతగా, జానపద, సినీ గాయనిగా, సినీ నటిగా కూడా పేరు సొంతం చేసుకుంది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా “తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం” అందుకున్న ఈమెను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్లో నియమించింది.2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగింది. 2020లో వచ్చిన ‘ఊల్లాల ఊల్లాల’ అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మరుసటి ఏడాది ‘మాస్ట్రో’ సినిమాలో కూడా నటించింది. తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె.. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత తీన్మార్ ప్రోగ్రాం తో టీవీ ఛానల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైంది. ఇక పలు చిత్రాలలో పాటలు పాడి, ఆ పాటలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మంగ్లీ.
ALSO READ:AS Ravi Kumar Chaudhary : ముక్కుసూటి మనిషి.. రవికుమార్ కెరియర్ లో బెస్ట్ గా నిలిచిన చిత్రాలివే!
రిసార్ట్ పార్టీపై పోలీసుల దాడి.. పోలీసులతోనే గొడవ చేస్తున్న సింగర్ మంగ్లీ#SingerMangli #Tollywood #Singer #Mangli #BirthdayParty #BIGTVCinema pic.twitter.com/LzbI9tuqFS
— BIG TV Cinema (@BigtvCinema) June 11, 2025