చిలగడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా దీని ధర కూడా చాలా తక్కువ. పేదవారి నుంచి ధనవంతుల వరకు అందరికీ అందుబాటులో ఉంటాయి. చిలగడదుంపలు ముఖ్యంగా చలికాలంలోనే ఎక్కువగా ఈ చిలగడదుంపలు దొరుకుతూ ఉంటాయి. మరికొన్ని రోజులు తర్వాత ఇవి దొరికే అవకాశం తగ్గిపోతుంది. వేసవిలో చిలగడ దుంపలు తక్కువగా వస్తాయి. కాబట్టి ఇప్పుడే చిలగడదుంపలను అధికంగా తినేందుకు ప్రయత్నించండి.
చిలగడదుంపలు భూమిలో పండుతాయి. వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నారింజ, గోధుమ, ఊదా రంగుల్లో ఈ అధికంగా లభిస్తూ ఉంటాయి. వీటిని ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. చిలగడదుంపల్లో పోషకాలకు కొరత ఉండదు. శరీరానికి కావలసిన విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటివి ఇందులో అధికంగా ఉంటాయి.
చిలకడదుంపలు తింటే ఇవి రావు
చిలగడ దుంపలు తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బలమైన రోగనిరోధక శక్తి వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీరు చిలగడదుంపను ప్రతిరోజు తింటే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి వంటివి మన శరీరానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి.
జీర్ణక్రియ కూడా చిలగడదుంప ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ దుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పేగు కదలికలు సులభతరంగా ఉంటాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్టిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాపాడడంలో చిలగడదుంప ముందుంటుంది.
గుండె ఆరోగ్యానికి చిలగడ దుంపలు చేసే మేలు అంతా ఇంతా కాదు. మన దేశంలో గుండె రోగుల సంఖ్య త్వరగా పెరుగుతోంది. కాబట్టి గుండెపోటు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిలగడదుంప వంటి ఆహారాలను మెనూలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చిలగడదుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. చిలగడదుంప తినడం వల్ల రక్తపోటు పెరగకుండా అదుపులో ఉంటుంది. ఎప్పుడైతే రక్తపోటు అదుపులో ఉంటుందో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
Also Read: క్యాన్సర్ కాదు.. అత్యధిక భారతీయులను చంపేస్తున్న భయానక వ్యాధి ఇదే, మీరూ జర భద్రం!
బరువు తగ్గవచ్చు
బరువు తగ్గాలనుకుంటున్న వారికే చిలగడదుంప మంచి ఉత్తమ ఎంపిక. ఇది రుచిగా ఉన్నప్పటికీ దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. చిలగడదుంపలు తిన్నాక పొట్ట నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి ఇతర ఆహారాలు మీరు తినకుండా అడ్డుకుంటుంది. తద్వారా మీరు బరువును అదుపులో ఉంచుకోవచ్చు. వీలైనంతవరకు చిలగడదుంపలు అందుబాటులో ఉంటే తినడమే మంచిది. ఇది మీకు అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది.