BigTV English
Advertisement

Broccoli: వర్షాకాలంలో బ్రోకలి తింటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు

Broccoli: వర్షాకాలంలో బ్రోకలి తింటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు

Broccoli: ప్రతీ కూరగాయ, ఆకుకూరతో ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కూరగాయల్లో కాలిఫ్లవర్ లా ఉండే బ్రోకలితో ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండే బ్రోకలి కాలిఫ్లవర్ జాతికి చెందింది. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. అంతేకాదు బ్రోకలిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇవి గతంలో కేవలం విదేశాల్లో మాత్రమే విరివిగా లభించేవి. కానీ ప్రస్తుతం మన దేశంలోను ఎక్కడ పడితే అక్కడ పండిస్తున్నారు. అయితే బ్రోకలిని తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


బ్రోకలిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను నివారించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా బ్రోకలిలో ఉండే ఫైబర్ వల్ల తగ్గించుకోవచ్చు. మరోవైపు బ్రోకలిలో పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక ఇందులో ఉండే ఫైబర్ వల్ల శరీరంలోని కొలస్ట్రాల్ ను కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇందులోని పొటాషియం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా బ్రోకలి ఎంతగానో సహకరిస్తుంది.

కాలేయంలో ఏర్పడే టాక్సిన్స్, హానికరమైన పదార్థాలను తొలగించేందుకు బ్రోకలీ సహాయపడుతుంది. బ్రోకలిలో ఉండే కాల్షియం, విటమిన్ కె, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ కె, కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. అంతేకాదు బ్రోకలిలో గ్లూకోసినోలేట్స్ పుష్కలంగా ఉంటాయి.


బ్రోకలిలో ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణాశంలో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగించేందుకు సహాయపడుతుంది. మరోవైపు బరువు తగ్గాలనుకునేవారు బ్రోకలీని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల చాలా సేపు ఆకలిని నియత్రిస్తుంది. ఇక మరోవైపు కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Ice Cubes For Burnt Pans: ఐస్ క్యూబ్స్ ఇలా వాడితే చాలు.. ఎంత మాడిన పాత్రలైనా కొత్తవాటిలా మెరుస్తాయ్

Qualities in Boys: అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే.. అమ్మాయిలు ఫిదా అయిపోతారట!

Maida Side Effects: ఆరోగ్యంగా ఉండాలా ? అయితే.. ఈ పిండితో చేసిన వంటకాలు తినడం మానేయండి

Loneliness: జగమంత కుటుంబం ఉన్నా.. ఒంటరి అన్న భావనలో మునిగిపోయారా?

Almond Milk:బాదం పాలు తాగితే.. మతిపోయే లాభాలు తెలుసా ?

Sweet Potato: 30 రోజుల పాటు.. చిలగడదుంప తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా? వద్దా?.. మీక్కూడా ఈ డౌట్ ఉంది కదూ!

Beers: 90 శాతం మందికి ఇది తెలియదు.. వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చంటే?

Big Stories

×