BigTV English
Advertisement

Skin Care Tips: దీపావళి రోజు కొత్తగా కనిపించాలా ? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

Skin Care Tips: దీపావళి రోజు కొత్తగా కనిపించాలా ? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

Skin Care Tips: దీపావళి నాడు అందంగా కనిపించేందుకు మహిళలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తుంటారు.ఇంట్లోనే కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలు అందాన్ని పెంచడంలో సహాయపడతాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ పండుగ గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. అంతే కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా దుస్తులు ధరిస్తారు.


ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారు నేచురల్‌గా ఫేషియల్ గ్లో పెరగడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

మీరు సహజమైన ఫేస్ ప్యాక్‌లు, క్లెన్సింగ్ , మాయిశ్చరైజింగ్‌తో పాటు ఇతర హోం రెమెడీస్‌తో మీ ముఖ సౌందర్యాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చిట్కాలు

ఫేస్ ప్యాక్స్: 
పెరుగు, తేనె: పెరుగు , తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఇది ముఖాన్ని మృదువుగా , కాంతివంతంగా మార్చుతుంది.

ముల్తానీ మిట్టి: ముల్తానీ మిట్టిని నీటిలో లేదా రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి పట్టించాలి. ఇది ముఖంలోని అదనపు నూనెను గ్రహించి మచ్చలను తగ్గిస్తుంది.

ఓట్స్ : ఓట్స్ ను గ్రైండ్ చేసి పెరుగు లేదా పాలతో కలిపి ముఖానికి అప్లై చేయాలి. అంతే కాకుండా ఇది ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మృత కణాలను కూడా తొలగిస్తుంది.

అరటిపండు: పండిన అరటిపండును మెత్తగా చేసి ముఖానికి పట్టించాలి. ఇది ముఖానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది.

క్లెన్సింగ్:
తేలికపాటి క్లెన్సర్‌తో ప్రతిరోజు ముఖాన్ని కడగాలి.
మేకప్ తొలగించడానికి మేకప్ రిమూవర్ ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి.

మాయిశ్చరైజింగ్:
రోజు మాయిశ్చరైజర్ ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు నైట్ క్రీమ్ తప్పకుండా రాసుకోవాలి.

కంటి సంరక్షణ:

కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించేందుకు దోసకాయ లేదా బంగాళదుంప ముక్కలను కళ్లపై ఉంచండి.
కళ్ల చుట్టూ మాయిశ్చరైజర్ కూడా రాసుకోవాలి. వీటి వల్ల కళ్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Also Read: బొప్పాయితో ముఖంపై మచ్చలు మాయం, అద్భుతమైన మెరుపు

హోం రెమెడీస్:
పసుపు: మొటిమలను తగ్గించడంలో సహాయపడే క్రిమినాశక గుణాలు పసుపులో ఉన్నాయి. ఇవి చర్మానికి కొంత మెరుపును అందిస్తాయి. తరుచుగా ముఖానికి పసుపును ఉపయోగించడం వల్ల చర్మం యొక్క రంగు మెరుగుపడుతుంది.

నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. తక్షణ మెరుపు కోసం నిమ్మరసంలో కాస్త చెక్కరను వేసి ముఖానికి పట్టించాలి.

టమాటో: టమాటోలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారం:
పోషకాహారం తినడంతో పాటు, పుష్కలంగా నీరు త్రాగాలి.
పండ్లు, కూరగాయలు తినండి.
వేయించిన, జంక్ ఫుడ్ మానుకోండి.

తగినంత నిద్ర:
రోజు 7-8 గంటలు నిద్రపోవాలి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×