BigTV English

Papaya Face Packs: బొప్పాయితో ముఖంపై మచ్చలు మాయం, అద్భుతమైన మెరుపు

Papaya Face Packs: బొప్పాయితో ముఖంపై మచ్చలు మాయం, అద్భుతమైన మెరుపు

Papaya Face Packs: బొప్పాయిలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల కూడా చర్మం అందంగా మారుతుంది. అంతే కాకుండా ఇది ఫేస్ పై ఉన్న మచ్చలను తొలగించడంతో పాటు డెడ్ స్కిన్‌ను పోగొట్టడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.


చర్మాన్ని యవ్వనంగా ఉండేలా కూడా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొప్పాయి ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయితో ఫేస్ ప్యాక్స్ ..


1. బొప్పాయి, తేనెతో ఫేస్ ప్యాక్
కావలసినవి:
బొప్పాయి పండు గుజ్జు- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో బొప్పాయి పండు గుజ్జుతో పాటు తేనెను తీసుకుని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాలు ఆగి ఫేస్ శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముచ్చలు కూడా తొలగిపోతాయి.

2. బొప్పాయి, పెరుగుతో ఫేస్ ప్యాక్

కావసినవి:
బొప్పాయి గుజ్జు- 1 టేబుల్ స్పూన్
పెరుగు- 1 టీ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదులో బొప్పాయి పేస్ట్ తీసుకుని దానికి పెరుగు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత దీనిని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా చేస్తుంది.

3. బొప్పాయి గుజ్జు, బియ్యం పండితో ఫేస్ ప్యాక్
కావలసినవి:

బొప్పాయి గుజ్జు- 1 టేబుల్ స్పూన్
బియ్యం పిండి- 1/2 టీ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదులో బొప్పాయి పండు గుజ్జుతో పాటు బియ్యం పిండిని ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని టోన్ చేసి మెరిసేలా చేస్తుంది.

4. బొప్పాయి గుజ్జు , నిమ్మరసంతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
బొప్పాయి గుజ్జు- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 టీ స్పూన్

Also Read: పసుపులో ఇవి కలిపి ముఖానికి అప్లై చేస్తే.. అందం రెట్టింపు

తయారీ విధానం: ఒక పండిన బొప్పాయిని మెత్తగా చేసి, దానికి ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా కాంతివంతంగా చేస్తుంది.  తరుచుగా బొప్పాయితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×