BigTV English

Tips For Skin Glow: వీటిని ఒక్కసారి వాడితే చాలు.. ఫేస్ మెరిసిపోద్ది

Tips For Skin Glow: వీటిని ఒక్కసారి వాడితే చాలు.. ఫేస్ మెరిసిపోద్ది

Tips For Skin Glow: అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ముఖ్యంగా అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బయట దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మరి కొందరు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడుతుంటారు. ముఖ్యంగా న్యాచురల్ గ్లో కోసం మనం ఇంట్లోనే తయారు చేసుకుని వాడే ఫేస్ స్కబ్స్ చాలా బాగా పనిచేస్తాయి.


ఫేస్ స్క్రబ్‌లు ముఖంపై పేరుకున్న మురికిని, డెడ్ స్కిన్‌ను తొలగించడంలో ఎంతగానో  సహాయపడుతాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం సహజంగా తయారు చేసిన ఫేస్ స్క్రబ్‌లను ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ పేరుతో మార్కెట్ లో ఖరీదైన వస్తువులు కొంటారు. కానీ అలా చేయకుండా
ఇంట్లోనే సులభంగా ఫేస్ స్క్రబ్ లను తయారు చేసుకుని వాడవచ్చు.

ఈ న్యాచురల్ ఫేస్ స్క్రబ్‌లు ముఖంపై మురికిని శుభ్రం చేయడమే కాకుండా చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. మరి ఇంత ప్రభావవతంగా పని చేసే ఫేస్ స్కబ్స్ ఎలా తయారు చేయాలి.. వాటిని వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఓట్స్ , పెరుగు ఫేస్ స్క్రబ్..
కావలసినవి:
ఓట్స్ పేస్ట్ -2 టీస్పూన్లు
పెరుగు -1 టీస్పూన్
తేనె- కొద్దిగా

తయారీ విధానం: ముందుగా ఓట్స్‌ను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. అందులో పైన చెప్పిన మోతాదుల్లో పెరుగు, తేనె కలిపి పేస్ట్‌ లాగా చేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల మీ ముఖం అందంగా , ఆరోగ్యంగా కనిపిస్తుంది.

2. కాఫీ, చక్కెర ఫేస్ స్క్రబ్..
కావలసినవి:
కాఫీ పౌడర్ -2 టీస్పూన్లు
చక్కెర -1 టీస్పూన్
కొబ్బరి నూనె -1 టీస్పూన్

తయారీ విధానం: ఈ స్క్రబ్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో కాఫీ పౌడర్, చక్కెర, కొబ్బరి నూనెలను వేసి బాగా కలిపి పేస్ట్ లాగా చేయండి. ఇలా తయారు చేసిన ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేయండి. దీనిని 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలను కూడా తగ్గిస్తుంది.

3. శనగ పిండి, పసుపు స్క్రబ్..

కావలసినవి:
శనగపిండి- 2 టీస్పూన్లు
పసుపు -1/4 టీస్పూన్
పాలు – కొద్దిగా

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన మోతాదుల్లో శనగపిండితో పాటు పసుపు, పాలను కలిపి పేస్ట్‌ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ స్క్రబ్ మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. శనగపిండి, పసుపుతో చేసిన స్క్రబ్ ముఖానికి కొత్త మెరుపును ఇస్తుంది.

Also Read: రైస్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం

4. టమాటో, పెరుగు స్క్రబ్..

కావలసినవి:
టమోటా గుజ్జు -1 టీ స్పూన్
పెరుగు- 1 టీ స్పూన్

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని ముందుగా పైన చెప్పిన మోతాదుల్లో టమాటో గుజ్జు, పెరుగులను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ స్క్రబ్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×