BigTV English

Weather alert: అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. కాకపోతే..

Weather alert: అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. కాకపోతే..

Weather alert: వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా  ఏపీ, తెలంగాణలో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఏపీతోపాటు తెలంగాణలోనూ నేటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం దాటికి ఉదయం నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఓ మోస్తరు వర్షం కురిసినట్టు తెలుస్తోంది.

తెలంగాణలోని పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలు పడే క్రమంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావం బుధవారం నాటికి బలహీనపడింది.


దీనికితోడు ఉపరితల ఆవర్తనం ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ALSO READ:  అధికారులకు షాక్.. అడ్డుకున్న మూసీ ప్రాంతవాసులు

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచన చేసింది.

మరోవైపు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై సహా పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. సూళ్లకు సెలవులు ఇచ్చేశారు. కుండపోత వర్షం కారణంగా అక్కడి వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఓ మహిళ డ్రైనేజీ కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది.

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×