BigTV English
Advertisement

Small Screen: 9 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన ప్రముఖ బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్..!

Small Screen: 9 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన ప్రముఖ బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్..!

Small Screen : సాధారణంగా ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు అలా పెళ్లి చేసుకొని ఇలా గర్భం దాలుస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. మరికొంతమంది అయితే కెరియర్ పైన దృష్టి పెడుతూ తల్లిదండ్రులు అవ్వడానికి సమయం తీసుకుంటున్నారు. ఉదాహరణకు దీపికా పదుకొనే, ఉపాసన తో పాటు చాలామంది సెలబ్రిటీలు వివాహము తర్వాత చాలా సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని ఇటీవలే గర్బం దాలుస్తూ తల్లిదండ్రులవుతున్న విషయం తెలిసిందే.


9 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన బుల్లితెర నటి..

అయితే ఇలాంటి కోవలోకే ఒక బుల్లితెర నటి కూడా చేరిపోయింది. బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఈమె, అక్కడే హిందీ సీరియల్స్ లో నటించి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బుల్లితెరపై ఈమె పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు సీరియల్స్ ద్వారానే భారీ పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ద్రష్టి ధామి (Drashti Dhami). ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా గర్భం దాల్చింది.


Small Screen: Famous TV actress who got pregnant after 9 years.. Photos viral..!
Small Screen: Famous TV actress who got pregnant after 9 years.. Photos viral..!

ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. మై బేబీ ఈజ్ కమింగ్..

త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాకుండా ” ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. మై బేబీ ఈజ్ కమింగ్.. ఇది చాలా దూరం ఉండదు” అంటూ బేబీ బంప్ ఫోటోలతో పాటు ఈ క్యాప్షన్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ద్రష్టి ధామి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు కూడా ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ద్రష్టి ధామి ప్రేమ, పెళ్లి..

ఇదిలా ఉండగా 2015లో నీరజ్ ఖేమ్కా(Niraj Khemka) ను వివాహం చేసుకుంది ద్రష్టి ధామి. పెళ్లయిన తర్వాత దాదాపు 9 ఏళ్లకు శుభవార్త చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈమె బేబీ బంప్ ఫోటోలు అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆరోగ్యంగా ఉండాలి అని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ద్రష్టి ధామి కెరియర్..

1984 జనవరి 10న ముంబైలోనే ఒక గుజరాతి కుటుంబంలో జన్మించిన ఈమె, అక్కడే చదువుకుంది మేరీ ఇమ్మాక్యులేట్ గర్ల్స్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ద్రష్టి, ఆ తర్వాత ముంబైలోని మిథిబాయి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈమె, తన నటనతో పలు అవార్డులు కూడా అందుకుంది.

 

View this post on Instagram

 

Related News

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..

Brahmamudi Serial Today November 8th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని చంపాడని రాహుల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు    

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై అనుమానం.. నిజం తెలిసిపోతుందా..? చక్రధర్ కు టెన్షన్..

GudiGantalu Today episode: గిఫ్ట్ కొట్టేసేందుకు ప్రభావతి ప్లాన్..బాలుకు మీనా క్లాస్.. సుశీల కోసం మనోజ్ గిఫ్ట్..

Serial Actress : కెమెరా బాయ్ టు యాక్టర్.. అనిల్ జీవితంలో కష్టాలు.. ఫస్ట్ రెమ్యూనరేషన్..?

Today Movies in TV : శనివారం సూపర్ హిట్ సినిమాలు..వాటిని అస్సలు మిస్ అవ్వకండి..

Karthika Deepam Jyotsana : ‘కార్తీక దీపం ‘ జ్యోత్స్న కు పెళ్లి అయ్యిందా..? బ్యాగ్రౌండ్ ఇదే..

Big Stories

×