BigTV English

Glowing Skin Tips: మీ ముఖం చందమామలా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి

Glowing Skin Tips: మీ ముఖం చందమామలా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి

Glowing Skin Tips: మహిళలు తమ ముఖంపై మెరుపు కోసం వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కొంతమంది పార్లర్‌లో ఖరీదైన ఫేషియల్స్ కూడా చేయించుకుంటారు. ప్రతి ఒక్కరూ మృదువైన, మెరిసే చర్మాన్ని ఇష్టపడతారు. చర్మం అందంగా మెరిసిపోవడానికి పోషకాహారం కూడా అవసరం. ఇదే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం.. సహజమైన స్కిర్ కేర్ ఉత్పత్తులు కూడా ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ముఖంపై మచ్చలను కూడా తొలగిస్తాయి. మరి ఎలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ చర్మ సౌందర్యం కోసం ఉపయోగించాలి. వీటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


పెరుగు మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది:
పెరుగు చర్మంపై సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పెరుగును తరుచుగా వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా పెరుగు సహాయంతో మీరు ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పెరుగులో కాస్త బియ్యం పిండి, పసుపు కలిపి స్క్రబ్ చేయాలి. మసాజ్ కోసం పెరుగులో తేనె లేదా అలోవెరా జెల్ మిక్స్ చేసి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. చివరగా పెరుగు, చందనం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.

అలోవెరా జెల్ మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది:
అలోవెరా జెల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ముఖంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. ముందుగా అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత కాస్త అలోవెరా జెల్‌లో ఓట్స్‌ పౌడర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత దీనితో ముఖాన్ని స్క్రబ్ చేయండి. మసాజ్ కోసం అలోవెరా జెల్‌లో దోసకాయ రసాన్ని కూడా వాడుకోవచ్చు. కలబంద జెల్‌లో రోజ్ వాటర్ , విటమిన్ ఇ కూడా కలుపుకోవచ్చు.


Also Read: పొరపాటున కూడా.. అమ్మాయిలు ఈ 5 వస్తువులను వాడకూడదు తెలుసా ?

పచ్చి పాలతో ఫేషియల్ చేయండి:
పచ్చి పాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. శుభ్రమైన ముఖంపై ఒక చెంచా పచ్చి పాలను అప్లై చేసి, ఆపై కాటన్ సహాయంతో శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఫేషియల్ చేయడానికి, కాస్త పచ్చి పాలలో శనగపిండిని కలిపి స్క్రబ్ చేయాలి. ఇందులో అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒక చెంచా పచ్చి పాలలో ముల్తానీ మిట్టి, తేనె , రోజ్ వాటర్ కలిపి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×