Nebulizer: చిన్న పిల్లలకు జలుబు లేదా ఊపిరి సమస్యలు వచ్చినప్పుడు, డాక్టర్లు తరచూ నెబులైజర్ వాడమని చెప్తారు. ఇది మెడిసిన్‌ని ఆవిరిలా లేదా పొగమంచులా మార్చి, ఊపిరితిత్తులకు నేరుగా వెళ్లేలా చేస్తుంది. జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి సమస్యలకు ఇది చాలా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్న పిల్లలకు నెబులైజర్ పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
నెబులైజర్ ఎలా పని చేస్తుంది?
నెబులైజర్ మందును లిక్విడ్ నుంచి చిన్న చిన్న తుంపరలుగా మారుస్తుంది. ఈ తుంపరలను పిల్లలు మాస్క్ లేదా మౌత్‌పీస్‌తో ఊపిరి పీల్చడం ద్వారా ఊపిరితిత్తులలోకి మెడిసిన్ వెళ్తుంది. జలుబు వల్ల కఫం చెరినప్పుడు, నెబులైజర్ దాన్ని సన్నగా చేసి, ఊపిరి వ్యవస్థను క్లీన్ చేయడానికి సాహాయపడుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
నెబులైజర్ వల్ల లాభమేంటి?
జలుబు చేసినప్పుడు ఊపిరి గొట్టాలు మూసుకుపోయి, ఊపిరి ఆడకపోవచ్చు. నెబులైజర్ మందు గొట్టాలను తెరిచి, ఊపిరి సాఫీగా ఆడేలా చేస్తుందట. అంతేకాకుండా దీని వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెబులైజర్ నుంచి వచ్చే మెడిసిన్ వల్ల ఊపిరితిత్తుల్లో వాపు తగ్గిపోతుందట. అలాగే దగ్గు, గురక లాంటి ఇబ్బందులను కంట్రోల్ చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
నెబులైజర్ మందు నేరుగా ఊపిరితిత్తులకు వెళ్తుంది కాబట్టి, సిరప్‌లు లేదా టాబ్లెట్‌ల కంటే తొందరగా రిలీఫ్ ఇస్తుందట. చిన్న పిల్లలకు టాబ్లెట్‌లు లేదా సిరప్‌లు ఇవ్వడం కష్టం. నెబులైజర్‌తో మాస్క్ ద్వారా మందు ఇవ్వడం సులభం, సేఫ్ కూడా.
ALSO READ: నెయిల్ పాలీష్‌లో క్యాన్సర్ కారకాలు..!
మందు నేరుగా ఊపిరితిత్తులకు వెళ్తుంది కాబట్టి, శరీరంలో మిగతా భాగాలపై ప్రభావం చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జలుబు లక్షణాలు తగ్గడానికి నెబులైజర్ తొందరగా రిలీఫ్ ఇస్తుందట.
ముఖ్యంగా రాత్రిళ్లు ఊపిరి ఆడకపోవడం వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు నెబులైజర్ వాడడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సలహాతో నెబులైజర్‌ను ఇంట్లోనే సులభంగా యూజ్ చేయొచ్చు. దీని వల్ల హాస్పిటల్‌కి వెళ్లే అవసరం తగ్గుతుంది.
జాగ్రత్తలు
నెబులైజర్ వాడేటప్పుడు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ మందు, ఎంత డోస్, ఎలా వాడాలో సరిగ్గా తెలుసుకోవాలి. నెబులైజర్‌ను క్లీన్‌గా ఉంచడం, సరైన మాస్క్ వాడడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మందు వాడితే పిల్లలకు ఇబ్బంది కలగొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిన్న పిల్లలకు జలుబు వచ్చినప్పుడు నెబులైజర్ ఒక సేఫ్, ఎఫెక్టివ్ ట్రీట్‌మెంట్. ఇది ఊపిరి సమస్యలను తగ్గించి, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. కానీ, డాక్టర్ సలహా లేకుండా వాడొద్దు. సరైన జాగ్రత్తలతో నెబులైజర్ వాడితే, పిల్లలు తొందరగా కోలుకుని, హెల్తీగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.