మన దేశంలో వాహనాలు నడపాలంటే కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందే. లైసెన్స్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదు. కాదని నడిపితే, జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు జైలు శిక్ష పడుతుంది. సాధారణంగా మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఒకటి నుంచి సుమారు నాలుగు రకాల వాహనాలు నడిపేందుకు లైసెన్స్ ఉంటుంది. కొంత మంది ఒకటి రెండు ఎక్కువగా ఉండవచ్చు. కానీ, మన దేశంలో ఏకంగా 11 రకాల వాహనాలు నడిపేందుకు లైసెన్సులు కలిగి ఉన్న బామ్మ ఉంది. అంతేకాదు, ఇన్ని రకాల వాహనాలు నడిపేందుకు అనుమతి ఉన్న ఏకైక భారతీయ మహిళ ఆమే కావడం విశేషం. ఇంతకీ ఈ అరుదైన గుర్తింపు ఉన్న మహిళ ఎవరు? ఆమె అన్ని వాహనాలను ఎలా నేర్చుకుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
11 రకాల వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన బామ్మ
74 ఏళ్ల బామ్మ పేరు రాధామణి. సొంతూరు కేరళ. తన భర్త ఎంకరేజ్ మెంట్ తో డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత భార్య భర్త కలిసి A-Z అనే డ్రైవింగ్ లైసెన్స్ స్థాపించారు. తమ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఎంతో మందికి వాహనాలు నడపడం నేర్పించారు. 2004లో ఆమె భర్త చనిపోయారు. ఒక్కసారిగా ఒంటరిగా మారిపోయింది. డ్రైవింగ్ స్కూల్ మూతపడింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. చాలా కాలం బాధలోనే గడిపింది. కానీ, తాను ఇలా ఉండటం తన భర్తకు అస్సలు నచ్చదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంది. ఎలాగైనా మళ్లీ తమ డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేయాలి అనుకుంది.
Read Also: ఓర్నీ.. ఏకంగా AIతో బేరం ఆడించి.. ఆటో ఎక్కేశాడు, ఇక భాషతో సమస్యే లేదు!
మళ్లీ డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసి రాధామణి
నెమ్మదిగా ఆమె తన బాధలను మర్చిపోయింది. పాత రాధామణిగా మారిపోయింది. ఇబ్బందులు ఎదురయినప్పటికీ, మళ్లీ A-Z డ్రైవింగ్ స్కూల్ ను మళ్లీ ఓపెన్ చేసింది. మళ్లీ కొత్త వారికి డ్రైవింగ్ నేర్పించడం మొదలు పెట్టింది. ఇప్పుడు రాధామణికి 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, బస్సు, లారీ, క్రేన్, ట్రాక్టర్, ఫోర్క్ లిప్ట్, జేసీబీ, రోడ్డు రోలర్, ట్రాన్స్ పోర్ట్ సహా 11 డిఫరెంట్ వాహనాలు నడిపేందుకు ఆమెకు డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. ఇండియాలో 11 రకాల లైసెన్సులు కలిగిన మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. 2022లో ఇన్సిప్రేషినల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు పొందింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది రాధామణి. తన డ్రైవింగ్ స్కూల్ లో పలువురు మహిళలకు ఉద్యోగాలు కల్పించింది. డ్రైవింగ్ నేర్పించే ట్రైనర్లుగా అపాయింట్ చేసుకుంది. తన సంపాదనతో ఎంతో మంది పేదలకు దాన ధర్మాలు చేస్తోంది. తను ఉపాధి పొందడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న రాధామణి నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. ఉద్యోగాలు లేవని బాధపడే వాళ్లు ఈమెను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: 4 రంగుల్లో ఇండియన్ పాస్ పోర్టులు, ఇది ఉంటే వీసా లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చు!