BigTV English

Good Sleep : యువతలో రోజుకు 6 గంట నిద్రే – తగ్గిపోతున్న క్వాలిటీ నిద్ర

Good Sleep : యువతలో రోజుకు 6 గంట నిద్రే – తగ్గిపోతున్న క్వాలిటీ నిద్ర

good sleep: మన బాడీ అన్ని పనుల్ని సక్రమంగా పని చేసుకునేలా చేసేందుకు నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్ర ఉంటే.. ఏ పనైనా, ఎంతటి అలసటని అయినా సులువుగా ఎదుర్కోవచ్చు. కానీ.. నేడు చాలా మంది యువత నిద్రలేమితో బాధపడుతున్నట్లుగా కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ లిస్ట్ లో హైదరాబాద్ యువత కూడా ఉంది. వివిధ కారణాలతో చాలా మంది యువత.. రోజుకు ఆరు గంటల కంటే తక్కువగా నిద్ర పోతున్నారు. ఆ నిద్రలేమిని వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల భర్తీ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. చాలా మంది యువత వారాంతాల్లో సైతం నిద్రలేమికి గురవుతున్నాయి. యువత మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపించే.. నిద్రపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి, వాటి ప్రభావం ఏంటో తెలుసుకుందాం.


నిద్రలేమి సమస్యపై దేశవ్యాప్తంగా 348 జిల్లాల నుంచి 43 వేల మందిపై కమ్యూనిటీ ఫోరమ్ లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం.. దాదాపు 59 శాతం మంది యువత రోజుకు ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారని తేలింది. అయితే.. వీరితో 23 శాతం మంది వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోవడం ద్వారా ఈ నిద్రను చేసుకోగలుగుతున్నారు. కానీ.. దాదాపు 38 శాతం మంది కోల్పోయిన నిద్రను అస్సలు భర్తీ చేయలేకపోతున్నట్లు వెల్లడైంది. అంటే.. వీరిపై ఆ మేరకు నిద్రలేమి సమస్యలు ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

ఇదే అంశంపై హైదరాబాద్ యువతనూ సంప్రదించి.. ఓ నివేదికను రూపొందించారు. దీనిని ‘హౌ ఇండియా స్లీప్స్’ అనే శీర్షికతో ఈ నివేదిక రూపొందించగా.. ఇందులో హైదరాబాద్ యువత సైతం నిద్రలేమిపై ఇలాంటి అనుభవాలనే వ్యక్తం చేసింది. భాగ్యనగరంలోని 48 శాతం మంది రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లు వెల్లడైంది. నిద్రలేమిని భర్తీ చేసుకోలేని వారు 34 శాతం మంది ఉన్నట్లుగా తెలిసింది.


అలాగే.. నిద్రలో అంతరాయాలతోనూ క్వాలిటీ నిద్రకు దూరమవుతున్న వాళ్లు ఉన్నారు. ఇలాంటి కారణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి రావడంతో నిద్రలో కొద్దిపాటి అంతరాయం వస్తుందని 37 శాతం మంది తెలుపగా, ఇంటి పనుల కారణంగా ఆలస్యంగా పడుకోవడం, మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్రలేవాల్సి రావడం కారణంగా 31 శాతం, మొబైల్ కాల్స్, సందేశాలకు సంబంధించిన అంతరాయాలతో 13 శాతం మంది నిద్రలో అంతరాయాల్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇక.. దోమలు, ఇతర వాహనాలు, నిర్మాణ శబ్దాల వంటి ఇతర కారణాలతో 15 శాతం ఉంది ఇబ్బంది పడుతున్నట్లుగా ఈ నివేదికలో వెల్లడైంది.

నిద్ర తక్కువైతే ముప్పు ఎక్కువవుతుంది

నిద్ర లేమితో పని చేసే ధోరణి మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అన్ని వయసుల వారికి 6-8 గంటల మంచి నిద్ర తప్పనిసరి అంటున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన నిద్ర దినచర్యను పాటించాలని సూచిస్తున్నారు. ఏదైనా కారణాలతో మిగతా రోజుల్లో సరైన నిద్ర లేకపోతే.. పగటిపూట లేదా వారాంతాల్లో కొద్దిసేపు నిద్రపోవడం ద్వారా నిద్రలేమిని భర్తి చేసుకోవచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాగే.. ప్రస్తుతం పెరిగిన పని కారణంగా.. ఒక వయోజనకుడు రాత్రి కనీసం 7-9 గంటలు నిద్రపోవడం చాలా అవసరం అని అంటున్నారు. నిద్ర లేమి వల్ల స్వల్పకాలిక ప్రభావాలైన శ్రద్ధ, ఏకాగ్రత తగ్గడం, నిపుణులలో పనిలో ఉత్పాదకత తగ్గుతుందని అంటున్నారు. విద్యార్థులలో విద్యా పనితీరు తగ్గడం చూడొచ్చని అంటున్నారు. నిద్ర లేమి కారణంగా.. డ్రైవర్లు వాహన ప్రమాదాలకు గురైయ్యే అవకాశం ఉందంటున్నారు. నిద్ర లేకపోవడం వల్ల డ్రైవర్ల సామర్థ్యాన్ని, నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. నిద్ర లేమి ఒక వ్యక్తిని చిరాకు, కోపంగా మారుస్తుంది. దీర్ఘకాలంలో, నిద్ర లేమి వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, ఆందోళన, చిత్తవైకల్యం, కొన్ని రకాల క్యాన్సర్, అకాల మరణం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Also Read : Brain Age: మీ మెదడు యంగ్‌గా ఉండాలా? గంపెడు పిల్లలని కనండి.. అదెలా?

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×