BigTV English

Eyelashes: కనురెప్పల వెంట్రుకలు నల్లగా, మందంగా పెరగాలంటే ఈ నూనెలు అప్లై చేయండి

Eyelashes: కనురెప్పల వెంట్రుకలు నల్లగా, మందంగా పెరగాలంటే ఈ నూనెలు అప్లై చేయండి

ముఖంలో కళ్ళే ప్రధాన ఆకర్షణ. కళ్ళు అంటే కనురెప్పలు, కనురెప్పల పైన వెంట్రుకలు కూడా భాగమే. అవన్నీ అందంగా ఉంటేనే మీ ముఖం అందంగా కనిపిస్తుంది. కొందరు కృత్రిమ కనురెప్పలను అతికించుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది మస్కరాను దట్టంగా పూస్తారు. ఇలా చేయాల్సిన అవసరం లేకుండానే సహజ నూనెలతో అక్కడున్న వెంట్రుకలను మీరు దట్టంగా పెంచుకోవచ్చు. ఏ నూనెలు వాడటం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయో తెలుసుకోండి.


ఆముదం
ఆముదాన్ని చాలా తక్కువ మంది వినియోగిస్తారు. దాని నుంచి వచ్చే వాసన ఎంతో మందికి నచ్చదు. కానీ దీనిలో రిసీనోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది వెంట్రుకలకు పూయడం వల్ల ఆ వెంట్రుకలు పొడవుగా ఎదుగుతాయి. తేమవంతంగా ఉంటాయి. అవి విరిగిపోకుండా పెరగడం ప్రారంభమవుతాయి. దీనిలో ఉండే యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె కేవలం శరీరానికి జుట్టుకు మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు. నిజానికి కనురెప్పలకు కూడా అప్లై చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కొబ్బరి నూనె సురక్షితమైనది. వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ప్రోటీన్ నష్టం లేకుండా అడ్డుకుంటుంది. వెంట్రుకలను బలపరుస్తుంది. నూనెలో ఉండే తేమ గుణం జుట్టు పొడిబారడాన్ని, విరిగిపోవడాన్ని అడ్డుకుంటుంది. అవి పొడవుగా, మందంగా ఎదిగేలా చేస్తుంది. కాబట్టి కొబ్బరినూనె అన్ని విధాలా మంచిది.


ఆలివ్ నూనె
ఆలివ్ నూనెలు వంటల్లో, సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. మీ జుట్టు, వెంట్రుకలను మందంగా మార్చుకోవడంలో కూడా ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. వెంట్రుకలను మరింత హైడ్రేట్ చేసి కండిషన్ చేసే లక్షణాలు దీనిలో ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జుట్టు కుదుళ్ళను పోషిస్తుంది. వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. వెంట్రుకలు విరిగిపోకుండా అడ్డుకుంటుంది. అలాగే దీనికి మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి వెంట్రుకలు మృదువుగా పెరిగేలా చేస్తుంది.

రోజ్ మేరీ
రోజు మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కనురెప్పలకు రాయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అక్కడ ఉన్న వెంట్రుకల లైనింగ్ లో వెంట్రుకల పెరుగుదల ప్రారంభమవుతుంది. పలుచుగా ఉన్న కనురెప్పలను మందంగా మార్చుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజ్ మేరీ ఆయిల్‌లో సమాన పరిమాణంలో కొబ్బరి నూనెను కూడా వేసి అప్పుడు దీన్ని వెంట్రుకలకు అప్లై చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

ఆర్గాన్ నూనె
ఇది అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది. మొరాకో ఆర్గాన్ చెట్టు నుండి తీసిన నూనె ఇది. దీనిలో విటమిన్ ఈ, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్ని వెంట్రులకు రాయడం వల్ల వెంట్రుకల పెరుగుదల ఉత్తమంగా ఉంటుంది. వెంట్రుకలు ఊడిపోకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే వాటిని బలోపేతం చేస్తుంది. ఇది వెంట్రులకు శక్తిని అందిస్తుంది. వారానికి మూడుసార్లు రాస్తే సరిపోతుంది.

Also Read: అక్కడి ప్రజలకు దుస్తులు అంటే అలర్జీ.. విప్పుకుని తిరిగితేనే ఎనర్జీ అట!

Tags

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×