BigTV English

Pimples Removal Tips:మొటిమలు తగ్గడానికి ఇవే బెస్ట్ ఆప్షన్స్ !

Pimples Removal Tips:మొటిమలు తగ్గడానికి ఇవే బెస్ట్ ఆప్షన్స్ !

Pimples Removal Tips: మారుతున్న సీజన్ కారణంగా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలంలో అధిక తేమ కారణంగా జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్యలు కూడా సాధారణంగా వస్తాయి. ముఖం మీద మొటిమలు కూడా కనిపిస్తుంటాయి. ఈ సీజన్‌లో చర్మంపై అలర్జీ ఫీలింగ్, ముఖం మీద ఎర్రటి దద్దుర్లు కూడా వస్తుంటాయి. ఇటువంటి సమస్య సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. అందుకే వర్షాకాలంలో చర్మంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వర్షాకాలంలో చర్మానికి హాని కలగకుండా కాపాడుకోవచ్చు.


చందనంతో ఫేస్ ప్యాక్:
వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో చర్మంపై మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పసుపు చందనంతో చేసిన ఫేస్ ప్యాక్‌‌ను ముఖానికి రాసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి రెండు స్పూన్ల గంధం పొడి, ఒక చెంచా పసుపు, కొన్ని చెంచాల రోజు వాటర్‌లను కలిపి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. దీని వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మం కాంతి వంతంగా మెరుస్తుంది.

అలోవెరా జెల్:
వర్షా కాలంలో చాలా మంది చర్మం సహజ మెరుపు కోల్పోతుంది. దీని కారణంగా చర్మం నిస్తేజంగా మారుతుంది. నిర్జీవమైన చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు ముఖానికి అలోవెరాను రాసుకోవచ్చు. ఇది చర్మానికి తేమను అందించి కోల్పోయిన మెరుపును తిరిగి తెస్తుంది. అలోవెరా జెల్ తరుచుగా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.


లవంగాలు:
అనారోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరం చేయడానికి లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి. చిన్నచిన్న సమస్యలే కాదు. హార్మోన్ల అసమతుల్యతకు కూడా ఇవి పనిచేస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి లవంగాలు తరచుగా ఉపయోగించవచ్చు. మొటిమలు సమస్యతో బాధపడే వారికి లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మ సమస్యలు ఉన్నప్పుడు మొటిమలు సమస్య మరింత పెరగడం ప్రారంభమవుతుంది. మీరు కూడా అలాంటి వారిలో ఒకరైతే మొటిమలు వదిలించుకోవడానికి వంటగదిలో ఉండే లవంగాలను ఉపయోగించవచ్చు.

లవంగాలు మొటిమలను దూరం చేస్తాయి. లవంగాల నూనె అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లో దీనిని సిద్ధం చేయడానికి మీరు కొబ్బరి నూనెలో లవంగాలను వేయాలి. దీనిని 15 నిమిషాల పాటు స్టౌ మీద మరిగించాలి. చల్లారిన కాటన్ బాల్‌తో దీన్ని మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. ముఖం అందంగా కనిపిస్తుంది.

Also Read: వీటిని ఫేస్‌పై నేరుగా అప్లై చేస్తే.. ఉన్న అందం కాస్త పాడవుతుంది

పసుపు ఫేస్ ప్యాక్:
యాంటీ ఫంగల్ లక్షణాలు పసుపులో పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలను వదిలించడానికి సహాయపడుతుంది. మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను కూడా తగ్గిస్తుంది. పసుసు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి రెండు టీస్పూన్ల వేప పొడిలో ఒక టీ స్పూన్ పసుపు కలపాలి. దీంట్లో కొద్దిగా నీరు జోడించి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×