Fatty Liver: హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలువబడే ఫ్యాటీ లివర్ సమస్య మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల లివర్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. జీర్ణక్రియకు సహాయం చేయడం రక్తంలోని రసాయనాల స్థాయిలను నియంత్రించడం, బైల్ ఉత్పత్తిని విసర్జించడంతో పాటు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడంలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కడుపు, ప్రేగుల నుండి వచ్చే రక్తం మొత్తం కాలేయం గుండా వెళుతుంది.
ముఖ్యమైన విధులను నిర్వహించే ఈ అవయవం ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో మీరు గ్రహించాలి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. కానీ మద్యం తాగని వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. కాలేయంలో కొవ్వు పెరగడం వల్ల చాలా తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. దీని గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్ సమస్య అంటే ఏమిటి ?
హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలువబడే ఫ్యాటీ లివర్ మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.హెపాటిక్ స్టీటోసిస్‌లో కాలేయంలో కొవ్వు పరిమాణం గణనీయంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి కాలేయం యొక్క సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. కాలేయంలో కొవ్వు శాతం పెరగడం వల్ల వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య తీవ్రమైతే..ఇది కాలేయ వైఫల్యానికి కారణం అవడమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది.
ఈ సమస్య నుండి బటయపడేందుకు చిట్కాలు:
మీ బరువును నియంత్రించుకోండి:
ఫ్యాటీ లివర్ సమస్యకు అధిక బరువు ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీర బరువును 10% తగ్గించుకోవడం వల్ల కాలేయ కొవ్వు, వాపు వల్ల కలిగే ఇతర సమస్యలను తొలగించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
తక్కువ బరువు ఉన్నవారికి కూడా భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.బరువు తగ్గిన వారిలో ఈ వ్యాధి వల్ల కలిగే సమస్యలు కూడా తగ్గుతాయి.
కాలేయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి:
వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ మీకు ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు ఆహారంపై శ్రద్ధ చూపడం, ఆకుపచ్చ కూరగాయలు , పండ్లతో పాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం, కొవ్వు పదార్ధాల తీసుకోవడం తగ్గించడం బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
చిన్నతనం నుండే బరువును అదుపులో ఉంచుకోవడంపై శ్రద్ధ పెడితే ఫ్యాటీ లివర్‌తోపాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Also Read: అరచేతులను రుద్దడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ?
ఫ్యాటీ లివర్‌కు దూరంగా ఉండేందుకు కూడా ఈ చర్యలు అవసరం:
బరువు తగ్గండి: బరువు పెరగడం ఈ వ్యాధికి ప్రధాన కారణం, కాబట్టి బరువు తగ్గడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి.
ఆహారం: ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించండి. ట్రైగ్లిజరైడ్స్ కూడా కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు.
మద్యానికి పూర్తిగా దూరంగా ఉండండి.
మీకు మధుమేహం ఉంటే, దానిని అదుపులో ఉంచుకోండి. చక్కెర పదార్థాలు తినడం మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది కాదు.
సమతుల్య-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఇది మీ శారీరక శ్రమను పెంచుతుంది.
కాలేయ సంరక్షణ కోసం రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోండి. అవసరమైన సలహాలను తీసుకుంటూ ఉండండి.