Srikanth Odela on Chiranjeevi : ప్రముఖ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ‘దసరా’ సినిమాతో తనలోని టాలెంట్ ను నిరూపించి మాస్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. అంతేకాదు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన ఈయన..ఈ సినిమాతో డైరెక్టర్గా అవతారం ఎత్తారు. ఈ సినిమాతో పలు అవార్డులు కూడా లభించాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన చిరంజీవి (Chiranjeevi)తో కలిసి పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ విషయంపై స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సెట్ లోకి వస్తే చిరంజీవి నా సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రమే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న శ్రీకాంత్ ఓదెల..
మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక బ్రాండ్. ఆయనను చూస్తూ పెరిగినవారు చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మరి కొంతమంది ఆయనతో కలిసి నటించాలని ఆరాటపడితే, ఇంకొంతమంది ఆయనతో కలిసి సినిమాలు చేయాలని అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో శ్రీకాంత్ ఓదెల కూడా ఒకరు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు.
నా సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ మాత్రమే..
శ్రీకాంత్ ఓదెలా మాట్లాడుతూ.. నేను నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనతో ఇప్పుడు పనిచేస్తున్నాను అంటే నమ్మలేకపోతున్నాను. కేవలం 48 గంటల్లోనే స్క్రిప్ట్ ని ఫైనల్ చేశాం. నాకు క్లౌడ్ నైన్ లో ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడు నేను ఆయనతో చేయబోయే సినిమా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఇకపై మీరు పాతకాలపు మెగాస్టార్ ని చూడలేరు. ప్రస్తుతం ఆయన వయసుకు తగ్గట్టుగానే ఆయన పాత్రను నేను రూపొందించబోతున్నాను. ఇక వాస్తవానికి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. అయితే..ఇది కారవాన్ లో ఉన్నంత వరకు మాత్రమే. కానీ సెట్స్ పైకి వస్తే మాత్రం నా సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ అంతే అంటూ తెలిపారు.
శ్రీకాంత్ డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా..
ఇకపోతే శ్రీకాంత్ ఓదెల ఈ మాట చెప్పడంతో ఆయన డెడికేషన్ కి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఎందుకంటే చిరంజీవికి శ్రీకాంత్ ఓదెల పెద్ద అభిమాని. అయితే ఒక అభిమాన హీరోని డైరెక్ట్ చేసినట్టు చేయడం లేదు. ఒక క్యారెక్టర్ లా మాత్రమే ట్రీట్ చేస్తున్నాడు. అంటే కథను అంత నమ్ముతున్నాడు కాబట్టే.. సినిమాలో అభిమాన హీరో అంటే కథకు న్యాయం చేయలేడు. కాబట్టి అందుకే తన అభిమాన హీరో అయినా సరే ఆ అభిమానాన్ని పక్కన పెట్టి, కథకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్లే అప్పుడే మంచి అవుట్ పుట్ వస్తుందని శ్రీకాంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా శ్రీకాంత్ చేసిన కామెంట్లు అందరిని అబ్బురపరుస్తున్నాయి. ఎవరైనా సరే అభిమానానికి పోతే ప్రేక్షకులను మెప్పించలేరు. అందుకే ఎంత పెద్ద వాళ్ళయినా సరే సెట్ లోకి వచ్చారంటే వాళ్ళని ఒక క్యారెక్టర్ లా మాత్రమే భావించగలిగితే, అప్పుడే పర్ఫెక్ట్ అవుట్ పుట్ వస్తుందని, దానిని శ్రీ కాంత్ ఓదెల నమ్ముతున్నాడు అని చెప్పవచ్చు. మరి శ్రీకాంత్ ఇంత పగడ్బందీగా సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.