East Godavari district: న్యూఇయర్ వేళ రేవ్ పార్టీలకు సిద్దమవుతున్నారు కొందరు వ్యక్తులు. అటు వైపు పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీని భగ్నం చేశారు. మొత్తం ఐదుగురు అమ్మాయిలు, 10 మంది యువకులు పట్టుబడ్డారు.
ఇంకా లోతుల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన 10 మంది యువకులు భారీగా రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. న్యూఇయర్ వస్తుండగా గుంటూరు నుంచి ఐదుగురు అమ్మాయిలను రాజమండ్రికి రప్పించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ రేవ్ పార్టీకి వేదికైంది.
రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల చెవిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఐదుగురు అమ్మాయిలతోపాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు కార్లు సీజ్ చేశారు. దాడులతో ఫంక్షన్ హాల్ యజమాని పరారీ అయ్యాడు. హాలు యజమాని లేకపోవడంతో కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ కోరుకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
పట్టుబడిన పలువురికి తమదైన కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అక్కడి నుంచి వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రేవ్ పార్టీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా అనే దానిపై పరీక్షలు చేశారు. ఎవరూ తీసుకోలేదని తేలింది. ఇటీవల కాలంలో రేవ్ పార్టీలు గోదావరి జిల్లాల్లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అటు వైపు దృష్టి సారించారు.
రేవ్ పార్టీ కలకలం
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవ్ పార్టీ
ఐదుగురు అమ్మాయిలతో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
యువతులు గుంటూరుకు చెందినవారు కాగా, యువకులు రాజమండ్రికి చెందినవారుగా గుర్తింపు
పరారీలో… pic.twitter.com/1M9Z3VlcWA
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2024