Hyderabad city: టెక్ యుగంలో యువతీ యువకుల ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి.. మారిపోతుంటాయి. క్షణాల్లో డబ్బులు సంపాదించే టాలెంట్ ఉన్నవారు ఉన్నారు. కానీ కష్టపడటానికి ఇష్టం లేని కొందరు.. చోరీలను వృత్తిగా ఎంచుకోవడం మొదలుపెట్టారు. అడ్డంగా దొరికిపోతున్నారు. అలాంటి వాటిలో పైన కనిపిస్తున్న ఈ మహిళ ఒకరు. చివరకు హైదరాబాద్ సిటీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయింది.
ఈ మధ్యకాలంలో కొందరు యువతీ యువకులు రూటు మార్చారు. తమ జల్సాల కోసం దొంగలుగా మారుతున్నారు. అనుకోకుండా పట్టుబడి కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న మహిళ ఒకరు. ఈమె పేరు జయ. సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని హమాలీ కాలనీకి చెందినది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చదువుకు గుడ్ బై చెప్పేసింది.
మూడేళ్ల కిందట అంటే 2023లో హైదరాబాద్ సిటీకి వచ్చింది. ఆ తర్వాత శివకుమార్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. నగరానికి వచ్చిన తర్వాత అందర్నీ గమనించింది. కొందరు బుర్ఖాలతో ఉండడంతో తన ఆలోచనకు పదును పెట్టింది. బురఖా ధరించి హ్యాండ్ కట్టర్ మిషన్ సాయంలో ఇళ్లపై కన్నేసింది. పగలు అంతా వీధుల్లో తిరిగేది. భారీ భవనాలను పరిశీలించేది. ఇంటికి తాళం వేసి ఉంటే ఆ ఇల్లు చోరీకి గురైనట్టే. ఆమె కన్నేస్తే ఎలాంటి ఇళ్లైనా చోరీ కావాల్సిందే.
తక్కువ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం టూ టౌన్, జగద్గిరిగుట్ట, మేడిపల్లి, ఉప్పల్ ఠాణాల పరిధిలోని దాదాపు ఐదు భారీ చోరీలకు పాల్పడింది. ఎట్టకేలకు శనివారం పోలీసులకు చిక్కింది. ఆమె నుంచి రూ.70 లక్షల విలువైన నగలు, నగదుతోపాటు ఖరీదైన ఐఫోన్- 17 లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ చూసినా పోలీసులకు ఆనవాళ్లు దొరికేవి కావు. చివరకు పక్కగా ప్లాన్ చేసి కిలాడీ లేడిని అరెస్టు చేశారు పోలీసులు. మల్కాజిగిరి సీపీ సుమతి మీడియా ముందు ఆమెని ప్రవేశపెట్టారు.
ALSO READ: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1నుండి వాటర్ ట్యాంకర్లు..?
పైన చెప్పిన గుట్టు అంతా విప్పారు. అక్టోబర్ 26న ఉప్పల్‌లోని న్యూభరత్ నగర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి ఇంటికి తాళం పెట్టి కొమురవెళ్లికి వెళ్లారు. ఈ ప్రాంతంలో ఉండే కిలాడీ జయ కన్ను.. ఈ ఇంటిపై పడింది. ఆ రాత్రి ఇంటి తాళం తొలగించి 48 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ చేసింది. అంతేకాదు రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లడంతో దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పక్కాగా స్కెచ్ వేసి అరెస్టు చేశారు పోలీసులు.
Two #arrested in #Uppal Zone theft cases; 37 #tolas of #gold recovered
In a series of theft cases, #Uppal Zone police arrested two accused, including a woman, and recovered around 37 tolas of #gold jewellery.
🔹 Naveen allegedly committed 10 thefts in just 20… pic.twitter.com/fUifKZ4lxv
— NewsMeter (@NewsMeter_In) October 31, 2026