BigTV English

Figs : శరీరానికి ఎంతో మేలుచేసే ఉలవలు

Figs : శరీరానికి ఎంతో మేలుచేసే ఉలవలు

Figs : ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో ప్రోటీన్స్ కలిగి ఉన్న ఉలవలను రోజువారీ ఆహారంలోకి తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి చేకూరుతుందని పోషక ఆహార నిపుణులు సూచిస్తున్నారు. కనీసం వారానికి రెండు, మూడుసార్లు అయినా ఉలవలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. మాంసం తినని వారికి ఉలవలు ఎంతో మంచి పోషకాహారం అని చెప్పవచ్చు. ఉలవల్లో ఫాస్ఫరస్, ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్స్, సమృద్ధిగా ఉంటాయి, అలాగే రక్తహీనత, అధికబరువు సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి ఎంపిక అనే చెప్పవచ్చు. ఉలవల్లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి ఉలవల్లో ఆకలిని పెంచే గుణాలు ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు వారంలో మూడుసార్లు అయినా ఉలవలు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి శరీరం నుండి బయటకు పంపడంలో సహాయపడతాయి. కడుపులో నులిపురుగులు నివారించడంలో ఉలవలు ఎంతో మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉలవల కషాయాన్ని పాలల్లో కలుపుకొని తాగడం వల్ల నులిపురుగులు నశిస్తాయి. కాబట్టి ఉలవలను కనీసం వారంలో రెండు, మూడు సార్లు తినడానికి ప్రయత్నం చేయండి. ఉలవల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజు ఒక కప్పు ఉడికించిన ఉలవలను ఉప్పు కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


Tags

Related News

Black pepper benefits: అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ పొడితో జస్ట్ ఇలా ట్రై చేయండి

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Face Scrub: ఈ ఫేస్ స్క్రబ్స్ వాడితే.. ముఖం మెరిసిపోతుంది తెలుసా ?

Big Stories

×