E-Paper
Advertisement

దీపావళికి టపాసులు కాలుస్తూ గాయపడ్డారా? కాలిన గాయలకు వెంటనే ఇలా చేయండి

దీపావళికి టపాసులు కాలుస్తూ గాయపడ్డారా? కాలిన గాయలకు వెంటనే ఇలా చేయండి
Advertisement

Diwali firecracker Burns Safety Tips| దీపావళి వచ్చిందంటే ఇళ్లన్నీ దీపాల వెలుగులతో, పిల్లల సందడితో కళకళలాడుతాయి. టపాసులు కాల్చడం పండుగలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, ముఖం, కళ్లకు కాలిన గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు తెలియక చేసే పొరపాట్ల వల్ల కూడా తీవ్ర గాయాలు కావచ్చు. అందుకే టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ కాలిన గాయాలు అయితే వెంటనే ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్‌ఓడీ మరియు కన్సల్టెంట్ డాక్టర్ అవిషేక్ ఛటర్జీ సూచించారు.

1. టపాసులు కాల్చడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోండి

ఎప్పుడూ బహిరంగ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి. ఇళ్లు, వాహనాలు, విద్యుత్ తీగలు, ఎండిన ఆకులకు దూరంగా ఉండాలి. బాల్కనీలు, ఇరుకైన వీధుల్లో టపాసులు కాల్చకూడదు. పిల్లలను పెద్దవాళ్లు ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. సీమ టపాసులు (స్పార్క్లర్లు) కూడా చాలా వేడిని విడుదల చేస్తాయి. కాబట్టి వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం.

2. మంటలు అంటుకోని దుస్తులు ధరించాలి

Advertisement

దీపావళి వేడుకల్లో నైలాన్, పాలిస్టర్ వంటి సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి. ఇవి వేడి వల్ల త్వరగా కరిగి చర్మానికి అంటుకునే ప్రమాదం ఉంది. కాటన్ దుస్తులు ధరించాలి. కాళ్లకు మూసి ఉండే విధమైన పాదరక్షలు వేసుకోవాలి. పొడవాటి జుట్టు ఉన్నవాళ్లు కట్టుకోవాలి. దుపట్టాలు, స్కార్ఫ్‌లు మంటలకు దూరంగా ఉంచాలి.

3. టపాసులు కాల్చేటప్పుడు ఈ నియమాలు పాటించండి

ఒకేసారి ఒక టపాసు మాత్రమే కాల్చి వెంటనే దూరంగా వెళ్లాలి. చేతితో పట్టుకుని టపాసులు వెలిగించకూడదు. పొడవాటి అగరబత్తీతో వెలిగించడం మంచిది. ఇతరుల వైపు టపాసులు విసరకూడదు. పేలని టపాసులను మళ్లీ వెలిగించకూడదు. కొంతసేపు వేచి ఉండి, వాటిని నీటిలో నానబెట్టి పారేయాలి. దగ్గరలో నీళ్లు లేదా ఇసుక బకెట్ ఉంచుకోవాలి. మద్యం సేవించిన తర్వాత టపాసులు కాల్చకూడదు.

4. గాయాలు అయితే వెంటనే ప్రథమ చికిత్స చేయాలి

Advertisement

కాలిన వెంటనే మొదటి 20 నిమిషాలు చాలా కీలకం. గాయపడిన వ్యక్తిని మంటలకు దూరంగా తీసుకెళ్లాలి. గాయమైన ప్రాంతంపై 20 నిమిషాల పాటు చల్లటి నీటిని పారించాలి. ఐస్ నేరుగా పెట్టకూడదు. వాపు రాకముందే ఉంగరాలు, గాజులు, గడియారాలు తొలగించాలి. చర్మానికి అంటుకోని దుస్తులను తొలగించాలి. గాయంపై శుభ్రమైన వస్త్రం లేదా స్టెరైల్ డ్రెస్సింగ్‌ వదులుగా కప్పాలి.

5. కాలిన గాయాలపై ఈ పదార్థాలు రాయకూడదు

కాలిన చోట టూత్‌పేస్ట్, నెయ్యి, వెన్న, నూనె రాయకూడదు. ఇవి గాయం మరింత తీవ్రం చేయవచ్చు. బొబ్బలను పగలగొట్టకూడదు. ఐస్ పెట్టడం, గాయాన్ని రుద్దడం కూడా మంచిది కాదు. తీవ్రమైన గాయాలైతే ఇంటి చిట్కాలతో సమయం వృథా చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

Also Read: ఇల్లు షిఫ్ట్ చేస్తుండగా వస్తువులు మాయం.. ఏసీ, టీవీ ధ్వంసం.. మూవర్స్, ప్యాకర్స్‌కు భారీ జరిమానా

6. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి

చర్మం తెల్లగా, గోధుమ రంగులో లేదా నల్లగా మారినా, పెద్ద బొబ్బలు వచ్చినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ముఖం, కళ్లు, చేతులు, కాళ్లు, కీళ్ల దగ్గర గాయాలైనా నిర్లక్ష్యం చేయకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా అత్యవసర చికిత్స అవసరం. కంటిలో టపాసుల రేణువులు పడితే రుద్దకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

Also Read: ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

7. పేలని టపాసులకు పిల్లలను దూరంగా ఉంచండి

పేలని టపాసులు సురక్షితమైనవని భావించి పిల్లలు వాటి దగ్గరకు వెళ్లకుండా చూడాలి. అవి ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉంది. పెద్దవాళ్లు మాత్రమే వాటిని నీటిలో నానబెట్టి తొలగించాలి. ఇంట్లో ప్రథమ చికిత్స పెట్టె, శుభ్రమైన డ్రెస్సింగ్‌లు, నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి.

చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. కాలిన గాయాలు అయితే వెంటనే ప్రథమ చికిత్స అందించి, అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. అందరూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి.

Related News

పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

టైం లేనప్పుడు..ఈ టేస్టీ కిచిడిని ట్రై చేయండి!రుచి అదిరిపోతుంది

రుచికరమైన సేమ్యా పాయసం..ఈ కొలతలతో చేస్తే చల్లారినా గట్టిపడదు

చాణక్య నీతి.. భర్తలు చేసే ఈ 5 తప్పులు వల్లే వైవాహిక జీవితం నాశనం

షుగర్ పేషెంట్లకు దీపావళి డైట్ ప్లాన్.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?

దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే అదృష్టం పట్టినట్లే.. ఈ సంకేతాలు శుభసూచకం

కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు మంచి అవకాశం వచ్చినా సంకోచిస్తారు

Big Stories

Advertisement
×