E-Paper
Advertisement

4 లక్షల మందికి విందు, గుర్రాల రేసు, విజేతకు కారు బహుమతి.. కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హంగామా

4 లక్షల మందికి విందు, గుర్రాల రేసు, విజేతకు కారు బహుమతి.. కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హంగామా
Advertisement

MLA Daughter Wedding| ఒక పెళ్లి వేడుకలో 4 లక్షల మందికి విందు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అందులోనూ గుర్రపు పందెం నిర్వహించి, విజేతకు ఏకంగా మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇస్తే? ఇప్పుడు ఓ రాజకీయ కుటుంబ వివాహం ఇలాంటి ఆసక్తికరమైన ఏర్పాట్లతో వార్తల్లో నిలిచింది. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, గాయకులు హాజరుకానున్న ఈ పెళ్లి వేడుకకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నవంబర్ 25న ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహం

బిహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన చిన్న కుమార్తె శివాంగి సింగ్ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 25న రిషికేశ్ కుమార్ అలియాస్ అంకిత్‌తో ఆమె వివాహం జరగనుంది. అదే రోజు అనంత్ సింగ్ చిన్న కుమారుడు అభినవ్‌కు ఉపనయన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం అనంత్ సింగ్ స్వగ్రామం లడ్మాలో వందల ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా డెకరేటర్లను రప్పించారు. అతిథుల కోసం భారీ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4 లక్షల మందికి భోజనాలు పెట్టాలని కుటుంబం భావిస్తోంది.

గుర్రపు పందెంలో విజేతకు మహీంద్రా థార్ బహుమతి

Advertisement

ఈ పెళ్లిలో గుర్రపు పందెం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మరో మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గుర్రాలు తెప్పిస్తున్నారు. ఈ పోటీలో విజేతకు మహీంద్రా థార్ కారు బహుమతిగా ఇవ్వనున్నారు. రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి మోటార్‌సైకిల్. ఈ విషయాన్ని అనంత్ సింగ్ స్వయంగా వెల్లడించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పెళ్లి వేడుకల్లో బాణసంచా కాల్చబోమని కూడా ఆయన తెలిపారు.

మోదీ నుంచి సినీ ప్రముఖుల వరకు సెలెబ్రిటీలకు ఆహ్వానాలు

ఈ వివాహానికి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీతారలు కూడా అతిథులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని అనంత్ సింగ్ భావిస్తున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లకు కూడా ఆహ్వానాలు పంపనున్నారు. సినీ నటుడు సోనూ సూద్, సింగర్ మైథిలీ ఠాకూర్, ఎంపీ మనోజ్ తివారీ, భోజ్‌పురి నటుడు పవన్ సింగ్, నటి అక్షరా సింగ్‌లకు కూడా ఆహ్వానాలు అందించనున్నారు. వేడుకల్లో భోజ్‌పురి, మగహి, ముంబై కళాకారులతో ప్రత్యేక సంగీత కార్యక్రమం కూడా ఉంటుంది.

Advertisement

Also Read: రాత్రి హైవేపై పంక్చర్‌తో ఆగిన లగ్జరీ కారు.. ఉదయం చూస్తే పూర్తిగా దగ్ధం.. బీమా నిరాకరించిన కంపెనీపై కేసు

ఎమ్మెల్యేపై హత్య కేసు

ఈ వివాహ వేడుకల తర్వాత కొన్ని రోజులకే ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ మరో కీలకమైన తేదీ ఎదురుకానుంది. దులార్చంద్ యాదవ్ హత్య కేసులో డిసెంబర్ 1లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
2025 అక్టోబర్‌లో మొకామాలో అనంత్ సింగ్ ప్రత్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న దులార్చంద్ యాదవ్ హత్యకు గురయ్యారు. ఈ హత్యను అనంత్ సింగ్ కుట్ర పన్ని చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనకు మార్చిలో పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నవంబర్ చివరికి ఆ బెయిల్ గడువు పూర్తికానుంది.

బిహార్ రాజకీయ కుటుంబాల్లో గతంలోనూ ఘన వివాహాలు

బిహార్ రాజకీయ కుటుంబాల వివాహాలు గతంలోనూ ప్రత్యేకంగా వార్తల్లో నిలిచాయి. 2018 మే 12న లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, మరో రాజకీయ నాయకుడి కుమార్తె ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సుమారు 7,000 మంది హాజరయ్యారు. అలాగే లాలూ చిన్న కుమార్తె రాజలక్ష్మి యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్‌ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాలు బిహార్, ఉత్తరప్రదేశ్ రాజకీయ కుటుంబాల మధ్య బంధాలను మరింత బలపరిచాయి.

Also Read: నెల జీతం సరిపోవడం లేదు.. ధరల పెరుగుదలతో విలవిల్లాడుతున్న 70 శాతం భారతీయులు

Related News

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి

ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!

మోదీ పాలనపై సోనియా ఫైర్.. 1975 నాటి ఎమర్జెన్సీపై క్లారిటీ.. కేంద్రమంత్రులు స్ట్రాంగ్ కౌంటర్!

నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్న భార్య.. అయినా భరణం కావాలని భర్తపై కేసు.. కోర్టు తీర్పు ఇదే

Big Stories

Advertisement
×