Flesh-Eating Bacteria in Japan: జపాన్‌లో భయంకరమైన బ్యాక్టీరియా వ్యాపిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ శనివారం నివేదించింది. ఈ బ్యాక్టీరియా కేవలం 48 గంటల్లోనే మనిషిని చంపుతుందని తెలిపింది. ఈ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి చాలా ప్రమాదకరమైందని పేర్కొంది.
జూన్ 2 నాటికి దేశంలో మొత్తం 977 స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) కేసులు బయటపడ్డాయని ఆ సంస్థ నివేదించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం, ఈ సంఖ్య గతేడాది(941) నమోదైన సంఖ్య కంటే ఎక్కువ
అరుదైన మాంసాన్ని తినే బ్యాక్టీరియా-గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ లేదా GAS సాధారణంగా వాపు, గొంతు నొప్పికి కారణమవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో, బాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతున్న లక్షణాలకు దారి తీస్తుంది, వాటిలో అవయవ నొప్పి, వాపు, జ్వరం, తక్కువ రక్తపోటు, నెక్రోసిస్, శ్వాస సమస్యలు. దీని ద్వారా అవయవ వైఫల్యం చెంది మరణం సంభవించవచ్చని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
ఈ వ్యాధి సోకిన వ్యక్తుల మరణాలు చాలా వరకు 48 గంటల్లోనే జరుగుతాయని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీలో అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు. “ఒక రోగి ఉదయం పాదంలో వాపును గమనించిన వెంటనే, అది మధ్యాహ్నం నాటికి మోకాలి వరకు విస్తరిస్తుంది. వారు 48 గంటల్లో చనిపోవచ్చు.” అని తెలిపారు.
ప్రస్తుత ఇన్ఫెక్షన్ల రేటు ప్రకారం, జపాన్‌లో ఈ సంవత్సరం కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని, మరణాల రేటు 30% ఉందని కికుచి తెలిపారు.
ప్రజలు చేతుల పరిశుభ్రతను పాటించాలని, ఏదైనా బహిరంగ గాయాలకు వెంటనే చికిత్స చేయాలని కికుచి కోరారు.
US CDC ప్రకారం, ఎవరికైనా STSS పొందవచ్చు, కానీ 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో ఇది సర్వసాధారణం.
Also Read: వానాకాలంలో దోమల బెడద.. మలేరియా వ్యాపిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి
ఓపెన్ గాయంతో ఉన్న వ్యక్తులు STSSకి ఎక్కువ ప్రమాదం ఉందని US CDC తన వెబ్‌సైట్‌లో తెలిపింది. మధుమేహం లేదా ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు, STSS సోకే ప్రమాదం ఎక్కువ ప్రమాదం ఉందని తెలిపింది.
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, జపాన్‌తో పాటు, అనేక ఇతర దేశాలు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ఇటీవలి వ్యాప్తిని ఎదుర్కొన్నాయి.