EPAPER

Australia vs Scotland: స్కాట్లాండ్‌పై ఆసీస్ విజయం..బతికిపోయిన ఇంగ్లాండ్

Australia vs Scotland: స్కాట్లాండ్‌పై ఆసీస్ విజయం..బతికిపోయిన ఇంగ్లాండ్

Australia vs Scotland T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగో విజయం. ఆదివారం గ్రాస్ ఐలెట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.


రెండో వికెట్‌కు 89 రన్స్..
తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జోన్స్(2) అనూహ్యంగా ఔటై వెనుదిరిగాడు. మున్సీ(23 బంతుల్లో 35 పరుగులు, రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు ), ఆ తర్వాత వచ్చిన బ్రెండెన్ మెక్‌మెల్లన్(34 బంతుల్లో 60 పరుగులు, రెండు ఫోర్లు, ఆరు సిక్స్‌లు), బెరింగ్టన్(31 బంతుల్లో 42 పరుగులు, ఫోర్, రెండు సిక్స్‌లు) రాణించారు. చివరిలో మాథ్యూ క్రాస్(18), మైఖేల్ లీస్క్(5), క్రిస్ గ్రీవ్స్(9) పరుగులు చేశారు. అంతకుముందు మున్సీ, మెక్‌మెల్లన్ రెండో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్ వెల్ 2, ఎగర్, నథన్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.

60 పరుగులకే 3 వికెట్లు..
స్కాట్లాండ్ విధించిన భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా మొదట తడబడింది. రెండో ఓవర్లలోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్(8) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేదు. షరీఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే మ్యాక్స్ వెల్(11) కూడా ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


దంచికొట్టిన మార్కస్
ఓపెనర్ ట్రావిస్ హెడ్( 49 బంతుల్లో 68 పరుగులు, ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు), మార్కస్(29 బంతుల్లో 59 పరుగులు, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్స్‌లు) దంచికొట్టారు. ఈ ఇద్దరు బౌండరీలు కొడుతూ ఆస్ట్రేలియాను లక్ష్యానికి చేరువ చేశారు. ఇక చివరిలో టిమ్ డేవిడ్(24), మాథ్యేహెడ్(4) పరుగులు చేసి విజయంలో కీల పాత్ర పోషించారు. దీంతో రెండు బంతులు మిగిలి ఉండగానే.. 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వట్ట, సఫ్యాన్ షరీఫ్ చెరో రెండు వికెట్లు, బ్రాడ్ వీల్ ఒక వికెట్ తీశారు.

సూపర్ 8కు ఇంగ్లాండ్
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓటమి చెందినప్పటికీ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో ఆ జట్టు సూపర్ 8 కు చేరకుండానే టోర్నీ నుంచి బయటకు వెళ్లనుంది. ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. మరో మ్యాచ్ రద్దు కావడం.. చివరి మ్యాచ్ ఓటమితో ఇంటిదారిపట్టింది. స్కాట్లాండ్ ఓటమితో ఇంగ్లాండ్ జట్టు సూపర్ 8కు వెళ్లింది. ఒకవేళ ఈ మ్యాచ్ స్కాట్లాండ్ గెలిచి ఉంటే.. ఇంగ్లాండ్ నిష్క్రమించేది. ఆస్ట్రేలియా గెలుపుతో ఇంగ్లాండ్ బతికిపోయింది.

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×