E-Paper
Advertisement

నన్ను క్షమించు.. ఒప్పుకోక తప్పడం లేదు: నభా నటేష్!

నన్ను క్షమించు.. ఒప్పుకోక తప్పడం లేదు: నభా నటేష్!
Advertisement

Nabha natesh:వజ్రకాయ సినిమాతో కన్నడ అరంగేట్రం చేసిన నభా నటేష్ (Nabha natesh) తొలిసారి 2018లో ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా నభా నటేష్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. పైగా సుధీర్ బాబుకి ఇది తొలి చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించింది.

క్షమించు అమ్మా!

ఇక ఇటీవల నాగబంధం సినిమాతో మరోసారి ఆడియన్స్ ను మెప్పించిన నభా నటేష్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ తో అందాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా “క్షమించు” అంటూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో” కొన్ని క్షమాపణలు చెప్పడం మరికొన్నింటి కంటే కష్టం.. ముఖ్యంగా అమ్మ చెప్పిందే మొదటి నుండి సరైనదని ఒప్పుకోవాల్సి వచ్చింది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలను కూడా క్యాప్షన్ గా జోడించింది. మరి ఎందుకు తాను తన తల్లికి క్షమాపణలు చెప్పాలనుకుంటుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

అమ్మ మాటలు పట్టించుకోలేదు..

Advertisement

అధికారిక ప్రకటన అంటూ ఒక నోట్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేసింది. అందులో ఇలా రాసుకొచ్చింది..” ఇటీవల నాకు తెలిసొచ్చిన ఒక నిజాన్ని మీ అందరితోనూ పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మ సలహాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకుండా నాకే ఎక్కువ తెలుసు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పడం లేదు.

మా అమ్మ చెప్పేది కరెక్టే..

ఏం తినాలి.. ఎప్పుడు పడుకోవాలి.. అతిగా ఆలోచించడం ఎప్పుడూ ఆపాలి.. ఆఖరికి నా కడుపు సహకరించనప్పుడు ఏం చేయాలి అన్నదానికి అమ్మ దగ్గర సమాధానం ఉంటుంది. కానీ నేనేం చేస్తాను ? గూగుల్లో వెతుకుతాను. రీల్స్ చూస్తాను. అవసరమైతే ఫ్రెండ్స్ ని అడుగుతాను. ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తాను. నిజానికి మొదట అడగాల్సిన అమ్మను తప్ప అందరిని అడుగుతాను. అమ్మా.. అందరి ముందు ఒప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఈసారి కూడా నువ్వే కరెక్ట్.. నీ మాట విననందుకు ఇదే నా బహిరంగ క్షమాపణ . ఇక నువ్వు.. “నేను ముందే చెప్పాను కదా”.. అనే లోపే సారీ అమ్మ” అంటూ తాను తన తల్లి మాటలను పెడచెవిన పెట్టిన విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు బహిరంగంగా తన తల్లికి క్షమాపణలు చెప్పింది. ఈ అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు :

Advertisement

నభా నటేష్ షేర్ చేసిన ఈ అధికారిక ప్రకటన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమైంది అని ప్రశ్నిస్తుంటే.. మరి కొంతమంది ఇది సినిమాకి ప్రమోషన్ అంటే మాత్రం నీ ముఖం మీద ఉమ్ము వేస్తారు జాగ్రత్త అని కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఇంత తెలుగు నువ్వెప్పుడు నేర్చుకున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే నభా నటేష్ కి ,తన తల్లికి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఈ పోస్ట్ పెట్టింది? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ALSO READ:స్నానం చేసేటప్పుడు కల్లు ఉప్పు వేసుకొని చేస్తా : సంయుక్త మీనన్!

నభా నటేష్ ప్రస్తుత చిత్రాలు…

నభా నటేష్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగానే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూలో కీలక పాత్ర పోషిస్తుంది. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సుందరవల్లి అనే పాత్ర పోషిస్తుంది. అలాగే తన సొంత ఇండస్ట్రీ కన్నడలోకి తిరిగి అడుగుపెడుతోంది. ధ్రువ సర్జ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. విశాల్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ధ్రువ సర్జాతో తొలిసారి జతకడుతోంది.

Related News

స్నానం చేసేటప్పుడు కల్లు ఉప్పు వేసుకొని చేస్తా : సంయుక్త మీనన్!

ఆకాశంలో ఒక తార.. సాత్విక వీరవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే?

2027సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న చిత్రాలివే!

ఎల్లో డ్రెస్సులో సందీపా ధర్ గ్లామర్ ట్రీట్..ఆ ఒక్క లైన్‌తో నెట్టింట ట్రెండింగ్!

కృష్ణతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. అసలు కారణం చెప్పిన డైరెక్టర్!

సమంతకు పుట్టేది కొడుకే 12 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్ !

“దివికి దివికి”.. వదినా మరదళ్లుగా దుమ్ములేపేసిన కీర్తి – కృతి!

Big Stories

Advertisement
×