BigTV English

Biotin For Hair Growth : కేశ సౌందర్యానికి బెస్ట్ ఫుడ్

Biotin For Hair Growth : కేశ సౌందర్యానికి బెస్ట్ ఫుడ్

Biotin For Hair Growth : జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో బీ7 లేదా బయోటిన్ కీలకం. జీవక్రియ సరిగ్గా కొనసాగాలంటే ఈ విటమిన్ అవసరం. కేశ సౌందర్యం కోరుకునే వారు బయోటిన్ ఎక్కువగా లభ్యమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.


గింజలు, విత్తనాల్లో ఇది సమృద్ధంగా ఉంటుంది. బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్‌లో బయోటిన్‌తో పాటు అన్‌శాట్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ అధికంగా లభిస్తాయి. లెగ్యూమ్స్‌లో బయోటిన్ పుష్కలం. శెనగలు, పప్పులు, సోయాబీన్స్‌లో ప్రొటీన్, ఫైబర్, సూక్ష్మపోషకాలతో పాటు బయోటిన్ కూడా అధికమే.

తృణధాన్యాల్లోనూ బయోటిన్ ఎక్కువగానే లభిస్తుంది. ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్‌ను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి. అరటి పళ్లు, అవకాడో, రాస్‌బె‌ర్రీ వంటి పళ్లలోనూ లభ్యమవుతుంది.ఇలా బయోటిన్‌ను తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు.. మెరుపుదనాన్ని కూడా సంతరించుకుంటుంది.


మోరంగడ్డలో లెక్కలేనన్ని పోషకాలు, విటమిన్లు, మినరళ్లు, ఫైబర్, కెరటనోయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బయోటిన్ అధికంగా ఉన్న బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్ మోరంగడ్డ. ఓ కప్పు ఉడికించిన చిలకగడదుంపలో ఇది 7 శాతం వరకు లభిస్తుంది. పుట్టగొడుగులను ఆహారంలో చేర్చితే మేలు. బయోటిన్‌తో పాటు లెక్కకు మించి పోషకాలు మష్రూమ్స్‌లో లభిస్తాయి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×