BigTV English

LDL : ఎల్‌డీఎల్‌కు చెక్ పెట్టండిలా..

LDL : ఎల్‌డీఎల్‌కు చెక్ పెట్టండిలా..
LDL

LDL : రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది చెడు కొలెస్ట్రాల్(ఎల్‌‌డీఎల్-లో డెన్సిటీ లిపోప్రొటీన్స్). శరీరంలో ఎల్‌డీఎల్ పరిమితి స్థాయిని మించితే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని స్థాయులు మించకుండా కట్టడి చేసే ఆహారాన్ని ఈ శీతాకాలంలో తీసుకోవాలి. అవేమిటో చూద్దాం.


కాలే

ఈ ఆకుకూరలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది.


వింటర్ స్వ్కాష్

తీపి గుమ్మడికాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి గుండెకు బలం చేకూరుస్తాయి. ఈ సీజన్‌లో విరివిగా లభ్యమయ్యే గుమ్మడికాయను ఫుడ్ మెనూలో తప్పనిసరిగా చేర్చాలి.

పాలకూర

లూటీన్, పొటాషియం, ఫైబర్ వంటివి పాలకూరలో అత్యధిక మోతాదులో లభిస్తాయి. కార్డియోవాస్క్యులర్ హెల్త్‌కు పోషకాలు ఇవి. ఏ సీజన్‌లోనైనా పాలకూర మనకు సమృద్ధిగా దొరుకుతుంది.

బీట్‌రూట్

గుండెకు బలాన్నిచ్చే నైట్రేట్స్ బీట్‌రూట్ లో లభిస్తాయి. శరీరంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయులను ఇది తగ్గిస్తుంది. బీట్‌రూట్ రసం తాగితే రక్తప్రసరణ మెరుగవుతుంది.

కేరట్

కేరట్‌లో బీటా కెరొటోన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతే కాదు.. కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో దోహదపడతాయి.

కాలీఫ్లవర్

శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడే వెజిటబుల్ ఇది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించే కాంపౌండ్లు, ఫైబర్ కాలీఫ్లవర్‌ ద్వారా లభిస్తాయి.

బ్రసెల్స్ స్ప్రౌట్స్

చూడటానికి చిన్న చిన్న క్యాబేజీల్లా ఉంటాయి. పోషకాల గనిగా బ్రసెల్స్ స్ప్రౌట్స్‌ను చెప్పుకోవచ్చు. దీనిలో కేలరీలు తక్కువ. సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ. ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయులను ఈ ఫైబర్ గణనీయంగా తగ్గిస్తుంది.

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×