BigTV English

Cm Revanthreddy : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అధికారిక బంగ్లా సందర్శన..

Cm Revanthreddy :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అధికారిక బంగ్లా సందర్శన..

Cm Revanthreddy: దేశరాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని 23వ నెంబర్ బంగ్లా తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా కేటాయించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ వచ్చినప్పుడు కేసీఆర్ ఉండేవారు. తాాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ బంగ్లాను సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలోని అధికారిక నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లడం ఇదే తొలిసారి.


ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి మొదటగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పీఏసీలో జరిగిన చర్చల గురించి, రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. అనంతరం సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉమ్మడి ఏపీ భవన్ విభజన, కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, OSD సంజూ జాజుతో చర్చించారు. ఉమ్మడి ఏపీ ఆస్తుల్లో తెలంగాణ వాటాలు ఏమి రావాల్సి ఉన్నాయనే అంశాలపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా వాటిని సాధించుకుని, కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×