E-Paper
Advertisement

బెస్ట్ ఫ్రెండ్‌తో బిజినెస్ చేయాలనుకుంటున్నారా?.. ఒక్కసారి ఇది చదవండి!

బెస్ట్ ఫ్రెండ్‌తో బిజినెస్ చేయాలనుకుంటున్నారా?.. ఒక్కసారి ఇది చదవండి!
Advertisement

Friendship Day Special:“రా… మనిద్దరం కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేద్దాం!” అని ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడో ఒకసారి మాట వచ్చిందే ఉంటుంది. కొందరు ఆ మాటతోనే ఆగిపోతారు. మరికొందరు నిజంగానే కంపెనీ స్టార్ట్ చేస్తారు. కానీ అందరూ సక్సెస్ అవుతారా అంటే… అస్సలు కాదు. కొందరి బిజినెస్ బాగా నడుస్తుంది. ఇంకొందరి ఫ్రెండ్‌షిప్ కూడా పోతుంది… బిజినెస్ కూడా పోతుంది.అందుకే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా… బెస్ట్ ఫ్రెండ్‌తో బిజినెస్ చేయాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలో చూద్దాం.

మొదటిది… ఫ్రెండ్ వేరు… పార్ట్‌నర్ వేరు. ఫ్రెండ్‌తో కాఫీ తాగడం, సినిమాలకు వెళ్లడం ఒకటి. కానీ ఒకే బిజినెస్‌లో డబ్బు పెట్టి పని చేయడం మరో విషయం. అక్కడ ఎమోషన్స్ కంటే లెక్కలే ఎక్కువ మాట్లాడతాయి.చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే… “మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా” అని ఏ పేపర్లు లేకుండా బిజినెస్ మొదలుపెట్టేస్తారు. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ లాభాలు రావడం మొదలైతే ఒక లెక్క… నష్టాలు వస్తే ఇంకో లెక్క. అప్పుడే అసలు కథ మొదలవుతుంది.

Advertisement

అన్ని ముందే మాట్లాడుకోండి 

అందుకే ఎవరు ఎంత డబ్బు పెడుతున్నారు? ఎవరు ఏ పని చూస్తారు? లాభాలు ఎలా పంచుకుంటారు? నష్టాలు వస్తే ఏం చేయాలి? ఇవన్నీ ముందే మాట్లాడుకుని రాసిపెట్టుకోవాలి. “ఫ్రెండ్ కదా” అని వదిలేస్తే… తర్వాత అదే పెద్ద తలనొప్పి అవుతుంది.ఇంకో విషయం… బిజినెస్‌లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఒకరికి రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంకొకరికి సేఫ్‌గా వెళ్లాలనిపిస్తుంది. అలాంటి టైమ్‌లో ఈగో చూపిస్తే పని అయిపోయినట్టే. ఎవరి మాటలో లాజిక్ ఉందో అది వినాలి.

Advertisement

డబ్బు విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వొద్దు. కంపెనీ డబ్బు, పర్సనల్ డబ్బు కలిపేస్తే చివరికి ఫ్రెండ్‌షిప్ కూడా మిగలదు. ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. అకౌంట్స్ క్లియర్‌గా ఉండాలి. లేదంటే “డబ్బులు ఏమయ్యాయి?” అనే ఒక్క ప్రశ్నతో ఏళ్ల స్నేహం  బ్రేక్ అవడం పక్కా

మరో ముఖ్యమైన విషయం… ఆఫీస్‌లో జరిగే గొడవలను ఇంటికి తీసుకెళ్లొద్దు. అలాగే పర్సనల్ ప్రాబ్లమ్స్‌ను బిజినెస్‌లోకి తీసుకురావొద్దు. రెండింటికీ ఒక గీత ఉండాలి. అప్పుడే రిలేషన్ కూడా బాగుంటుంది… బిజినెస్ కూడా బాగుంటుంది.

ఫ్రెండ్‌తో బిజినెస్ చేస్తే ఎదిగే ఛాన్స్ ఎక్కువ..కాని 

నిజమైన బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ ప్రతి మాటకు “అవును” అనేవాడు కాదు. మీరు తప్పు చేస్తే ముఖం మీదే “ఇది కరెక్ట్ కాదు” అని చెప్పేవాడు. అలాంటి ఫ్రెండ్‌తో బిజినెస్ చేస్తే ఎదిగే ఛాన్స్ ఎక్కువ అని గుర్తు ఉంచుకోండి.

ఇంకో విషయం గుర్తుంచుకోండి… డబ్బు సంపాదించడం కంటే మంచి ఫ్రెండ్‌ను సంపాదించడం చాలా కష్టం. కాబట్టి చిన్న చిన్న అపార్థాల కోసం ఏళ్ల స్నేహాన్ని పాడుచేసుకోవద్దు. మాట్లాడుకుంటే చాలా సమస్యలు అక్కడికక్కడే సాల్వ్ అవుతాయి.

ఫ్రెండ్‌షిప్ కూడా జీవితాంతం

చివరగా ఒక మాట… బెస్ట్ ఫ్రెండ్‌తో బిజినెస్ చేయొచ్చు. కానీ నమ్మకం ఒక్కటే సరిపోదు. దానికి తోడు క్లారిటీ, నిజాయితీ, బాధ్యత, పారదర్శకత కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే బిజినెస్‌లో ప్రాఫిట్ వస్తుంది… ఫ్రెండ్‌షిప్ కూడా జీవితాంతం అలాగే ఉంటుంది.

ఈ ఫ్రెండ్‌షిప్ డే రోజున మీ ఫ్రెండ్‌కు విషెస్ చెప్పడమే కాదు… కలిసి ఏదైనా చేయాలనుకుంటే ముందు మంచి ప్లాన్ వేసుకోండి. ఎందుకంటే మంచి ఫ్రెండ్‌తో కలిసి సాధించిన విజయం… ఒక్కడిగా సాధించిన విజయానికి మించిన ఆనందాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

Related News

అమ్మాయిల ఫ్రెండ్‌షిప్.. అబ్బాయిల ఫ్రెండ్‌షిప్.. అసలు తేడా ఏంటి?

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. బెస్ట్ ఫ్రెండ్స్ కోసం హార్ట్ టచింగ్ కొటేషన్స్!

రాత్రి డిన్నర్, ఉదయం టిఫిన్ మధ్య ఈ గ్యాప్ ఉంటే.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది!

రోజూ ORS తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణం అదే

ఆగస్టు మొదటి ఆదివారమే ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటారు? ఆసక్తికరమైన నిజాలు

జీవితంలో నిజమైన స్నేహితుడు ఎంత ముఖ్యం? ఫ్రెండ్షిప్ డే స్పెషల్

ఫ్రెండ్ షిప్ డే రోజు మీ ఫ్రెండ్‌కి ఇవి గిఫ్ట్ ఇవ్వండి,వాళ్లు ఫిదా అవడం గ్యారంటీ!

Big Stories

Advertisement
×