E-Paper
Advertisement

మీల్ మేకర్ పులావ్..బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్

మీల్ మేకర్ పులావ్..బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్
Advertisement

Meal maker pulao: ఉదయం లేచింది మొదలు ఆఫీసులకు వెళ్లేవారికి, పిల్లలను స్కూల్‌కి పంపే తల్లులకు “ఈరోజు లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలి?” అనేదే పెద్ద టాస్క్. రోజూ సాదా లంచ్ బాక్స్ తిన లేక పిల్లలు ఇంటికి బాక్సులు అలానే ..వెనక్కి తెస్తుంటారు. అలాంటి బోర్ కొట్టే.. లంచ్ బాక్స్‌లకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదేనండీ.. కేవలం పది నిమిషాల్లో తయారైపోయే ‘మీల్ మేకర్ పులావ్’తో ఈ సమస్య ఉండదు! ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సోయా చంక్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లల ఎదుగుదలకు ఇది ఎంతగానో సహాయ పడుతుంది.

కావలసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం లేదా సాధారణ బియ్యం – 1 కప్పు (శుభ్రంగా కడిగినవి)

Advertisement

మీల్ మేకర్ (సోయా చంక్స్)-1 కప్పు

ఉల్లిపాయ -1 (పొడవుగా తరిగినది)

Advertisement

పచ్చిమిర్చి -3 or 4

అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 స్పూన్

టమాటా – 1 (చిన్న ముక్కలు)

బిర్యానీ ఆకు,లవంగాలు, ఇలాచీ, చెక్క – కొద్దిగా

పుదీనా, కొత్తిమీర తరుగు – గుప్పెడు

గరం మసాలా -అర స్పూన్

నెయ్యి లేదా నూనె -2 స్పూన్లు

ఉప్పు, నీరు -తగినంత

తయారీ విధానం :

1. ముందుగా ఒక గిన్నెలో.. వేడి నీళ్లు తీసుకొని అందులో మీల్ మేకర్ వేయాలి. ఐదు నిమిషాల పాటు వాటిని నాననివ్వాలి. ఆ తర్వాత నీరంతా గట్టిగా పిండేసి.. పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీల్ మేకర్ సాఫ్ట్‌గా మారుతుంది. అంతే కాకుండా మసాలా రుచి బాగా పడుతుంది.

2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ లేదా పాన్.. పెట్టి రెండు స్పూన్ల నెయ్యి , నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, చెక్క వేసి వేయించాలి. ఆ తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.

3. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు, పుదీనా, కొత్తి మీర వేసి మగ్గనివ్వాలి. టమాటా మెత్త బడిన తర్వాత.. ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్‌ను వేసి బాగా కలపాలి.చివరగా కొద్దిగా గరం మసాలా, పసుపు, రుచికి సరి పడా ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.

Also Read: గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

4. ఇప్పుడు నాన బెట్టుకున్న బియ్యం వేసి.. ఒకసారి మెత్తగా కలపాలి. బియ్యానికి సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ అయితే.. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.పాన్ అయితే మూత పెట్టి అన్నం పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతే.. గుమగుమలాడే వేడివేడి మీల్ మేకర్ పులావ్ రెడీ!

ఉదయం పూట హడావుడిలో సమయం తక్కువగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్ కోసం ఏం చేయాలని ఆలోచించకుండా ఈ మీల్ మేకర్ పులావ్‌ను ట్రై చేయండి. నిమిషాల్లో.. తయారై పోయే ఈ రెసిపీని పిల్లలు ఎంతో ఇష్టంగా బాక్స్ అంతా ఖాళీ చేసి మరీ తింటారు.ఈ రోజే మీ ఇంట్లో దీన్ని ప్రయత్నించి మీ లంచ్ టైమ్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకోండి!

Related News

బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది

ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

పుదీనా పచ్చడి ఇలా చేస్తే..అన్నం మొత్తం లాగించేస్తారు!

మీ బీపీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోందా? ముందు కిచెన్‌లో ఈ 5 ఫుడ్స్ తీసి పడేయండి

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా పాడవుతోందా? నీరు పోసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

తగ్గేదెలే.. ఈ 5 రాశుల్లో పుట్టినవారు చివరి నిమిషం దాకా పోరాడుతారు

చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది.. శరీరంలో నీరు తగ్గితే వచ్చే సమస్యలివే

Big Stories

Advertisement
×