E-Paper
Advertisement

వెంకీ మామకు షాక్.. ఆదర్శ కుటుంబం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే!

వెంకీ మామకు షాక్.. ఆదర్శ కుటుంబం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే!
Advertisement

Adarsha Kutumbam Collections:‘ఆదర్శ కుటుంబం’ (AK 47) …విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజు కేవలం 16 కోట్ల వసూళ్ళని మాత్రమే రాబట్టడం గమనార్హం.పైగా సినిమాకి డివైడ్ టాక్ రావడం తో రెండో రోజు కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.

ముఖ్యంగా ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురావాలంటే ఎంత వసూళ్లు సాధించాలి? ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది? బ్రేక్ ఈవెన్ చేరుకోవడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

Advertisement

నిజానికి వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందని చెప్పక్కర్లేదు . అందులోనూ ఆయన కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్‌కు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.మరోవైపు త్రివిక్రమ్ సినిమాలంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో పాటు,ప్రాసలు పంచులకి నవ్వని ఆడియన్స్ లేరంటే ఆశ్చర్యం లేదు.అలాంటిది వీరిద్దరి కలయికలో సినిమా రావాలని చాలామంది అభిమానులు కోరుకున్నారు.

అలాంటి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, నారా రోహిత్‌తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే భారీ అంచనాల మధ్య అక్టోబర్ 30న వచ్చిన ఈ సినిమా అనుకున్నంత వసూళ్ళని రాబట్టలేకపోవడం గమనార్హం,ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ పారితోషికాన్ని పక్కన పెడితే నిర్మాణ వ్యయం దాదాపు రూ.వంద కోట్ల పైనే ఉందని టాక్ . అయితే ఇది అఫీషియల్ కాదని గుర్తుంచుకోవాలి.

Advertisement

ఇక ఈ సినిమాకు ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో సుమారు రూ.60 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ ఆదాయం వచ్చినట్లు ఇన్ సైడ్ టాక్ .మరోవైపు థియేట్రికల్ రైట్స్ విలువ సుమారు రూ.60 కోట్లని వినిపిస్తుంది.. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి దాదాపు రూ.65 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుందన్న మాట . గ్రాస్ రూపంలో చూస్తే సుమారు రూ.130 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంటుంది. కానీ మొదటి రోజే ఈ రకమైన వసూళ్ళని వెనకేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో అది అందుకుంటుందా అంటే అనుమానమే .

ఇక తొలి రోజు కలెక్షన్లను చూస్తే 16 కోట్లలో 9కోట్ల పై చిలుకు తెలుగు రాష్ట్రాల నుండే వచ్చిందట . కర్ణాటకలో రూ.2కోట్లు, తమిళనాడులో రూ.25లక్షలు, కేరళలో రూ.1.50 లక్షలు వచ్చాయని సమాచారం.అయితే సోషల్ మీడియా టాక్ అని గ్రహించాలి.ఇక రెండో రోజు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా పదికోట్ల వరకు వరల్డ్‌వైడ్ గ్రాస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.చూడాలి మరి ఈ సండే అయినా ఏమైనా కలిసి వస్తుందేమో .!

also read:గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

Tags

Related News

పెయింటింగ్‌లా పాలక్ తివారీ.. చూపు తిప్పుకోనివ్వని అందంతో సోషల్ మీడియాలో రచ్చ!

ఆ ఏడు రోజులు నిద్రపోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్

అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటున్న హెబ్బా!

రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. రేపే అసలు హంగామా!

ఎస్పీ బాలు చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? కన్నీళ్లు పెట్టించిన సాలూరి వాసు రావు!

మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!

Big Stories

Advertisement
×