E-Paper
Advertisement

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. బెస్ట్ ఫ్రెండ్స్ కోసం హార్ట్ టచింగ్ కొటేషన్స్!

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. బెస్ట్ ఫ్రెండ్స్ కోసం హార్ట్ టచింగ్ కొటేషన్స్!
Advertisement

Heart touching friendship day quotes : ఈ ప్రపంచంలో మన కన్నీళ్లను తుడిచి, పెదవులపై క్షణాల్లోనే చిరునవ్వులు పూయించే అద్భుతమైన బంధం స్నేహం. రక్త సంబంధం కాకపోయినా, మనతో పాటు నడిచే నిజమైన ఆత్మబంధువులే మన స్నేహితులు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే అలాంటి మధురమైన బంధానికి ప్రతీకగా నిలిచేదే ‘ఫ్రెండ్‌షిప్ డే. కులమతాలు, ప్రాంతాల బేధాలు లేకుండా ప్రతి మనసును కదిలించే ఈ పవిత్రమైన రోజు, మన జీవితంలో నిజమైన మిత్రుల విలువను మరోసారి గుర్తుచేస్తుంది. ఈ సందర్భంగా మన గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తానై నడిచే ప్రాణమిత్రులకు మనసులోని భావాలను వ్యక్తపరచడానికి కొన్ని స్పెషల్ కోట్స్.

హార్ట్ టచింగ్ కొటేషన్లు :

1. రక్తం పంచుకొని పుట్టకపోయినా, ప్రాణంతో సమానంగా ప్రేమించే బంధమే నిజమైన స్నేహం. అలాంటి ఫ్రెండ్ మన జీవితంలో ఉంటే.. అంతకంటే అదృష్టం ఉండదు !హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

Advertisement

2. కన్నీరు వస్తే ఓదార్చేవారు చాలా మందే ఉంటారు, కానీ కన్నీరు రాకముందే మన కళ్లను చదివేవాడే అసలైన స్నేహితుడు. ఆ బంధం మాటలకు అందని ఒక అద్భుతం. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

3. సంతోషంలో అందరూ మనతో పాటు నడుస్తారు, కానీ కష్టంలో మన చేయి వదలని మిత్రుడే నిజమైన ఆస్తి. ఆ బంధం వెలకట్టలేనిది. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే మై డియర్ ఫ్రెండ్స్..

Advertisement

4. జీవితమనే పుస్తకంలో ఎన్నో పేజీలు మారుతుంటాయి, కానీ ఎప్పటికీ చెరిగిపోని అక్షరాల లాంటిది మంచి స్నేహబంధం. అది కాలం మారినా ఎప్పటికీ  మారదు. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే డియర్..

5. మాటలతో చెప్పలేని బాధను కూడా ఒక్క చూపుతో అర్థం చేసుకునే శక్తి స్నేహానికి మాత్రమే ఉంది. అందుకే ఫ్రెండ్ దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

6. మన విజయాలకు అసలైన సంతోషాన్నిచ్చేది, మన ఓటములలో మనకు కొండంత అండగా నిలిచేది ఒక్క నిజమైన మిత్రుడే. ఆ బంధం జన్మజన్మల బంధం.హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

7. ప్రపంచమంతా నీ వైపు నిలబడినప్పుడు నీతో ఉండేవాడు స్నేహితుడు కాదు, అందరూ నీకు వ్యతిరేకమైనప్పుడు నీ చెయ్యి పట్టుకునేవాడే అసలైన స్నేహితుడు. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

8. వేల పుస్తకాలు చదివి నేర్చుకోలేని జీవిత పాఠాలను, ఒక్క నిజమైన మిత్రుడితో గడిపిన క్షణాలు నేర్పిస్తాయి. స్నేహమే జీవితానికి అసలైన అర్థం. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

9.మనల్ని మనం కోల్పోయినప్పుడు మనల్ని మనకు పరిచయం చేసేది కేవలం స్నేహమే. ఆ బంధం మనకు జీవితాంతం ధైర్యాన్ని ఇస్తుంది. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

10. కాలం మారుతుంది, రూపాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి కానీ స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు. అదే నిజమైన మిత్రుల గొప్పతనం. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

11. మనం తప్పు చేస్తే ధైర్యంగా మందలించి, లోకాన్ని ఎదిరించాల్సి వస్తే ముందుండి నడిపించే ధైర్యమే స్నేహం. ఆ బంధానికి మించినది మరొకటి లేదు.హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

12.డబ్బుతో ఎన్నో బంధాలను కొనొచ్చు కానీ, నిస్వార్థంగా ప్రేమించే నిజమైన స్నేహాన్ని ఎవరూ కొనలేరు. అది కేవలం అదృష్టం ఉంటేనే దొరుకుతుంది.అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

13. ఒక మంచి మిత్రుడు మనకు దొరికితే, జీవితంలో ఎదురయ్యే ఏ కష్టాన్నయినా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే డియర్..

14. ఎన్ని మైళ్ల దూరం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు కలవకపోయినా మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసేదే నిజమైన స్నేహం. ఆ బంధానికి దూరం ఎప్పుడూ లెక్కలోకి రాదు. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే ఆల్..

15. ఈ జీవితం ముగిసే చివరి క్షణం వరకు తోడుండే ఒకే ఒక్క మధురమైన జ్ఞాపకం నిజమైన స్నేహం. ఆ బంధం మనల్ని ఎప్పటికీ చిరజీవిగా ఉంచుతుంది. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..

Related News

రాత్రి డిన్నర్, ఉదయం టిఫిన్ మధ్య ఈ గ్యాప్ ఉంటే.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది!

రోజూ ORS తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణం అదే

ఆగస్టు మొదటి ఆదివారమే ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటారు? ఆసక్తికరమైన నిజాలు

జీవితంలో నిజమైన స్నేహితుడు ఎంత ముఖ్యం? ఫ్రెండ్షిప్ డే స్పెషల్

ఫ్రెండ్ షిప్ డే రోజు మీ ఫ్రెండ్‌కి ఇవి గిఫ్ట్ ఇవ్వండి,వాళ్లు ఫిదా అవడం గ్యారంటీ!

ఆర్భాటాలు లేకుండా ఉండలేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ‘షో ఆఫ్’ చేస్తుంటారు

చాణక్య నీతి.. ఈ 5 తప్పుల వల్లే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు

Big Stories

Advertisement
×