Zombie Series: క్రేజీ జాంబీ సిరీస్‌లంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చే పేరు The Walking Dead. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ప్రతి స్పిన్-ఆఫ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరింత విస్తరిస్తూ The Walking Dead Dead City Season 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి కథలో కేవలం వాకర్స్ మాత్రమే కాదు… బతికున్న మనుషులే ప్రమాదంగా మారడం ఆసక్తిని పెంచుతోంది. పాడుబడిపోయిన న్యూయార్క్ నగరం, అధికార పోరు, ప్రాణాల కోసం జరిగే యుద్ధం, మ్యాగీ-నెగన్ మధ్య కొత్త సమీకరణాలు ఈ సీజన్‌పై భారీ అంచనాలు పెంచాయి. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ప్రపంచం మొత్తం జాంబీలతో నిండిపోయిన తర్వాత కూడా మనుషుల మధ్య యుద్ధాలు మాత్రం ఆగవు. ఈసారి కథ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న మ్యాన్‌హట్టన్ నగరంలో సాగుతుంది. ఒకప్పుడు వెలుగులతో మెరిసిన ఈ మహానగరం ఇప్పుడు భయంతో నిండిన యుద్ధభూమిగా మారిపోతుంది. వాకర్స్ ఎక్కడ చూసినా తిరుగుతూనే ఉంటారు. కానీ వారికంటే ప్రమాదకరంగా మారింది అధికారాన్ని దక్కించుకోవాలని చూసే మనుషులే.
ఎప్పుడూ ఒకరినొకరు ద్వేషించే మ్యాగీ, నెగన్ ఈసారి పరిస్థితుల వల్ల చేతులు కలపాల్సి వస్తుంది. గతంలోని చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి కొత్త కమ్యూనిటీని నిర్మించాలనే లక్ష్యంతో ఇద్దరూ కలిసి ముందుకు సాగుతారు. అయితే అది అంత సులభం కాదు. నగరాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూసే వివిధ గ్యాంగులు, క్రూరమైన నాయకులు, నమ్మకద్రోహాలు వారి ప్రతి అడుగును ప్రమాదంలోకి నెడతాయి.
ఒక్కో ఎపిసోడ్ ముందుకు సాగే కొద్దీ కొత్త కుట్రలు బయట పడతాయి. మిత్రులుగా కనిపించే వాళ్లే శత్రువులుగా మారుతారు. ప్రాణాలు కాపాడుకోవాలా ? లేక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలా ? అనే కఠిన నిర్ణయాల మధ్య కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. వాకర్స్‌తో జరిగే పోరాటాల కంటే మనుషుల మధ్య జరిగే మైండ్ గేమ్స్, అధికార పోరు ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మ్యాగీ, నెగన్ కలిసి ఈ యుద్ధాన్ని గెలిచారా? కొత్త కమ్యూనిటీని నిర్మించగలిగారా ? మ్యాన్‌హట్టన్‌లో చివరకు ఎవరి ఆధిపత్యం కొనసాగింది ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.
ప్రస్తుతం ‘ది వాకింగ్ డెడ్ -డెడ్ సిటీ సీజన్ 3’ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండనున్న ఈ సీజన్‌లో జులై 26 నుంచి… ప్రతి ఆదివారం ఒక కొత్త ఎపిసోడ్ విడుదలవుతోంది. ఇందులో భారీ యాక్షన్, హారర్, సర్వైవల్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలు, రాజకీయ ఆధిపత్య పోరును సమపాళ్లలో చూపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. జాంబీల కంటే మనుషులే భయంకరమని చూపించే పోస్ట్ అపోకలిప్టిక్ కథ కథ ఈ సిరీస్. ప్రతి ఎపిసోడ్ తర్వాత తర్వాత ఏమవుతుందా అనే ఆసక్తి పెరుగుతుంది. ఈ వీకెండ్‌లో థ్రిల్లింగ్ సర్వైవల్ డ్రామా చూడాలనుకుంటే ఈ సిరీస్ మీ కోసమే. తెలుగు డబ్బింగ్ మాత్రం అందుబాటులో లేదు.
Read Also: తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో