Gas Burner Cleaning: గ్యాస్ స్టవ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరకలు ఏర్పడతాయి. ఎప్పడికప్పుడు గ్యాస్ స్టవ్ శుభ్రం చేయకపోతే మొండి మరకలు పేరుకుపోతాయి. గ్యాస్ స్టవ్‌తో పాటు వాటిపై ఉండే పాత్రలు, బర్నర్‌ల మరకలు తొలగించడం చాలా కష్టమైన పని. మరకలు తొలగించడానికి మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కూడా మీ వంటగదిలోనే ఉందని ఎంతమందికి తెలుసు. అవును వంటగదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు గ్యాస్ బర్నర్ , స్టవ్‌లపై ఉన్న మరకలను సులభంగా తొలగించేందుకు ఉపయోగపడతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్:
నల్లగా జిడ్డుగా మారిన గ్యాస్ బర్నర్‌లను తెల్లగా మార్చడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా ఉపయెగపడుతుంది. దీని కోసం గ్యాస్ స్టవ్ మీద ఉన్న మరకలపై కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ వేయండి. ఆ తర్వాత అలాగే వదిలేయండి అనంతరం స్క్రబ్ సహాయంతో మరకలను శుభ్రం చేయండి. తరువాత నీటితో శుభ్రం చేయడం వల్ల గ్యాస్ స్టవ్ మెరుస్తుంది.
గ్యాస్ బర్నల్ నల్లగా ఉంటే.. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కాస్త బేకింగ్ సోడా వేసి అందులోనే గ్యాస్ బర్నర్స్ వేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత బ్రష్‌తో రుద్దండి. అనంతరం చల్లటి నీటిలో వేసి వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ బర్నల్ తెల్లగా మారతాయి.
ఉల్లిపాయ:
గ్యాస్ స్టవ్ ,బర్నర్లను శుభ్రం చేయడానికి మీరు ఉల్లిపాయను ఉపయోగించవచ్చు. దీని కోసం కొన్ని ఉల్లిపాయలను తీసుకుని నీటిలో 20 నిమిషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు నీటిని చల్లారనివ్వండి. దీని తరువాత గ్యాస్ స్టవ్ మీద ఉన్న మరకలను ఈ వాటర్ లో స్క్రబ్ ముందు దీని సహాయంతో శుభ్రం చేయండి. ఈ ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా గ్యాస్ స్టవ్ కొన్ని నిమిషాల్లో శుభ్రం అవుతుంది. అంతే కాకుండా గ్యాస్ బర్నర్ ఈ నీటిలో వేసి మరిగించినా కూడా తెల్లగా మెరిసిపోతుంది.
వంట సోడా:
బేకింగ్ సోడాను గ్యాస్ స్టవ్‌తో సహా అన్ని రకాల పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. దీని కోసం బేకింగ్ సోడాతో నిమ్మరసం ,ఆపిల్ వెనిగర్ కలిపి గ్యాస్ స్టవ్ శుభ్రం చేయండి. ఈ ద్రావణంలో ముందు బ్రష్ ముంచి బర్నర్ లను శుభ్రం చేసినా కూడా కొత్త వాటిలా మెరిపోతాయి.
నిమ్మకాయ:
మొండి మరకలను తొలగించడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు. దీని కోసం మీరు నిమ్మరసం,నిమ్మ తొక్కను ఉపయోగించవచ్చు. నిమ్మ తొక్కపై కొన్ని చుక్కల బేకింగ్ సోడా లేదా ఆపిల్ వెనిగర్ వేసి గ్యాస్ స్టవ్ శుభ్రం చేయండి. ఇది మీ గ్యాస్ స్టవ్‌ను బాగా శుభ్రం చేస్తుంది.
Also Read: విపరీతంగా జుట్టు రాలుతోందా ? ఈ టిప్స్ మీ కోసమే !
డిష్ వాష్:
వీటితో పాటు మీరు వంటగదిలో ఉండే డిష్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం స్క్రబ్ మీద కొన్ని చుక్కల ద్రవాన్ని వేయండి. దీని తరువాత గ్యాస్ స్టవ్ మీద పేరుకుపోయిన మురికిని స్క్రబ్ తో శుభ్రం చేయండి. ఇది మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుంది.