Salman Khan: ఎంత స్టార్ హీరో అయినా వారు చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని వల్ల తమ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాతికేళ్ల క్రితం చేసిన తప్పు ఇంకా తనను వెంటాడుతూనే ఉంది. దాని వల్ల తనకు ప్రాణహాని కలగడం, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడమే కాకుండా కొన్నిరోజులు జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఆ రోజులు సల్మాన్ కెరీర్‌లో బ్లాక్ మార్క్‌లాగా మిగిలిపోయింది. అదే కృష్ణ జింట వేట కేసు. తాజాగా అసలు ఆ కేసు వల్ల తను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి, కొన్నాళ్ల జైలు జీవితం గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు సల్మాన్.
మొదటి పోడ్కాస్ట్
తాజాగా తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో మనసు విప్పి మాట్లాడాడు సల్మాన్ ఖాన్. ఈరోజుల్లో చాలావరకు నటీనటులు పోడ్కాస్ట్‌లు ఇస్తున్నారు. ఆ పోడ్కాస్ట్‌లో తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను, ఎన్నో సీక్రెట్స్‌ను పంచుకుంటున్నారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటివరకు అలాంటి పోడ్కాస్ట్‌లు పాల్గొనలేదు. మొదటిసారి అర్హాన్ ఖాన్‌తో కలిసి పోడ్కాస్ట్‌లో పాల్గొని తన ఫ్యాన్స్‌కు తెలియని ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. కృష్ణ జింకను వేటాడిన కేసులో జైలు జీవితాన్ని గడిపిన సల్మాన్.. ఈరోజులను గుర్తుచేసుకొని బాధపడ్డాడు. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడని తను మొదటిసారి మనసు విప్పి మాట్లాడాడు.
జైలులో నిద్రపోయాను
జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత తనకు నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపాడు సల్మాన్ ఖాన్. ‘‘నేను అలసిపోయినా లేవాలని అనుకుంటాను. నిద్ర రావడం లేదు అనిపిస్తే నిద్రపోకూడదని అనుకుంటాను. ఎలాగైనా నిద్ర వస్తుంది. అందుకే నాకు ఈ విషయాలు అర్థం కాదు. నేను రోజుకు గంట లేదా రెండు గంటలు పడుకుంటాను. నెలకు ఒకసారి లేదా రెండుసార్లు ఏడు గంటలు పడుకుంటాను. ఒక్కొక్కసారి షూటింగ్ మధ్యలో అయిదు నిమిషాలు బ్రేక్ దొరికితే చైర్ మీదే నిద్రపోతాను. నాకేం పని లేని సందర్భాల్లో కూడా నిద్రపోతాను. జైలులో ఉన్నప్పుడు ఎక్కువగా పడుకునేవాడిని, అది ఏం చేయాలని నిస్సహాయ పరిస్థితి’’ అని చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్ (Salman Khan).
Also Read: ఏజ్ లో తమకంటే చిన్న హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్ళే
ఎప్పటికప్పుడు కష్టపడాలి
‘‘వర్క్, ఫ్యామిలీ విషయానికొస్తే ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉండాలి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్. 1998లో కృష్ణ జింకను వేటాడడంతో సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదయ్యింది. 2006లో తనకు అయిదు సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వెంటనే తనకు బెయిల్ వచ్చినా కూడా ఆ కొంతకాలం జైలు శిక్ష అనుభవించక తప్పలేదు. 2018లో కూడా మళ్లీ అదే జరిగింది. కానీ ఈ విషయంపై సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడలేదు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘సికిందర్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో.