BigTV English

Ghee For Skin: చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?

Ghee For Skin: చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?

Ghee For Skin: నెయ్యి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే.. చర్మ సంరక్షణలో దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? కాకపోతే, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను నెయ్యి కలిగిస్తుంది. ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడడమే కాకుండా మృదువుగా చేసి అద్భుతమైన గ్లోని ఇస్తుంది. చర్మానికి నెయ్యి ఉపయోగించడం వల్ల మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది. అంతే కాకుండా ముడతల సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.


ముడతలు తొలగిపోతాయి:
ముఖానికి దేశీ నెయ్యి ఉపయోగించడం వల్ల ముడతలు చాలా వరకు తగ్గుతాయని చాలా తక్కువ మందికి తెలుసు. విటమిన్ ఇ దేశీ నెయ్యిలో ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు కొన్ని రోజుల పాటు రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని నెయ్యితో మసాజ్ చేయండి. దీని తర్వాత మీరు మీ ముఖాన్ని కడుక్కోవాలి. తరువాత మంచి మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి.

పొడిబారిపోతుంది:
పొడి చర్మం ఉన్న వారు దేశీ నెయ్యి ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నెయ్యిని మాయిశ్చరైజర్‌గా కూడా అప్లై చేయవచ్చు. ప్రతి రోజు మీరు స్నాం చేసే బకెట్‌లో 3-4 స్పూన్ల దేశీ నెయ్యిని కూడా యాడ్ చేయవచ్చు.


డార్క్ సర్కిల్స్ వదిలించుకోండి:
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించేందుకు దేశీ నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. మీ కళ్ల చుట్టూ కొన్ని చుక్కల నెయ్యి వేసి, ఆపై వేళ్ల సహాయంతో కళ్ల చుట్టూ మృదువుగా మసాజ్ చేయాలి. దీంతో బద్ధకం, అలసట తొలగిపోవడమే కాకుండా నల్లటి వలయాలు కూడా దూరమవుతాయి.

Also Read: డార్క్ సర్కిల్స్ తగ్గించే మార్గాలివే!

మృదువైన పెదవులు:
పొడి పెదాల సమస్యను నయం చేయడంలో దేశీ నెయ్యి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెదాలపై నెయ్యి రాసుకోవడం వల్ల పెదవులు పొడిబారడం సమస్య తగ్గుతుంది. తరుచుగా పొడి పెదవుల సమస్యతో ఇబ్బంది పడే వారు నెయ్యిని ఉపయోగించవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×