BigTV English

Kumbh Mela 2025: కుంభమేళా భక్తులకు షాక్.. పడుకొని మరీ వెళ్లొచ్చన్నారు.. చివరికి ఏంజరిగిందంటే..

Kumbh Mela 2025: కుంభమేళా భక్తులకు షాక్.. పడుకొని మరీ వెళ్లొచ్చన్నారు.. చివరికి ఏంజరిగిందంటే..

Kumbh Mela 2025: భక్త జన కోటి సందడి, సాధువుల సమ్మేళనం, దేశ విదేశాల నుంచి తరలివచ్చే యాత్రికులు, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే శాస్త్రోక్తమైన పూజలు, దీప దానాలు, భజనలు, గంగా హారతులు, అఖాడాల ప్రదర్శనలు.. ఇలా మహా కుంభమేళా ఎంతో మహోన్నతంగా సాగుతోంది. హిందూ సనాతన ధర్మం విశిష్టతను, ప్రాముఖ్యతను చాటుతోంది.


భూమిపై జరిగే.. అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సంబరం ఎలా ఉంటుందో, సాధువుల సందడి ఏ విధంగా సాగుతుందో అందరి కళ్లకు కడుతోంది మహా కుంభమేళా! ఈ భూమి మీద జరిగే అత్యంత గొప్ప హిందూ మహోత్సవం.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ కుంభమేళా మహా వైభవం.. ప్రపంచం నలుమూలకూ చేరిపోయింది. ఈ భూమిపై హిందూ మతాన్ని విశ్వసించి.. సనాతన ధర్మాని ఆచరించే వాళ్లందరి దృష్టి ఇప్పుడు ప్రయాగ్ రాజ్ మీదే ఉంది.

ఈ దేశంలో.. హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే ఉత్సవాల్లో ప్రధానమైనది మహా కుంభమేళా. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమే.. హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించే ఈ మేళాలో సాధువులు, అఘోరాలే.. ప్రత్యేక ఆకర్షణ. వాళ్లను చూసేందుకు.. వారి ఆశీర్వాదం తీసుకునేందుకు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే వాళ్లెందరో ఉన్నారు. 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుపుకునే ఈ పవిత్ర ఉత్సవం.. భారతీయ సంస్కృతికి, సంప్రదాయానికి అద్దం పడుతోంది.


సాధువులంతా ఒక్కటై తరలివస్తున్న క్షణాలు.. ఒకేసారి ఆచరిస్తున్న అమృత స్నానాలతో.. ప్రయాగ్‌రాజ్ అంతా ఓ ఆధ్యాత్మిక జిల్లాగా కనిపిస్తోంది. ఆ పవిత్ర క్షేత్రమంతా.. దైవ నామస్మరణతో మార్మోగుతోంది. ఈ కుంభమేళాకు వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. తెలుగురాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వెళుతుంటారు. అయితే కుంభమేళా వెళ్లే భక్తులకు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ షాక్ ఇచ్చాడు. మధ్యలోనే వదిలేసి పరార్ అయ్యాడు. అసలేం జరిగిందంటే..

Also Read: కైలాస యాత్రకు ఒకే.. భారత్ – చైనా ఒప్పందాలు ఇవే..!

బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్ ప్రయాణికులు కుంభమేళాకు బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. మెహిదీపట్నంలో బస్ ట్రబుల్ ఇచ్చిందని యాజమాన్యం వేరే బస్ అరేంజ్ చేసింది. అయితే.. ఆ బస్సులో వసతులు సరిగ్గా లేవని ప్రయాణికులు మండిపడ్డారు. దీంతో.. ఆ డ్రైవర్ మేడ్చల్ చేరుకున్న తర్వాత బస్ పక్కకు ఆపి పరార్ అయ్యాడు.

డ్రైవర్ పక్కకు ఎక్కడకో వెళ్లాడని ప్రయాణికులు అనుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి వారికి విషయం అర్థం అయింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులు అంతా రోడ్డు మీదే పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. పాసింజర్లలో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వాళ్లు పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు. వారు బుక్ చేసుకున్న న్యూ ధనుంజయ ట్రావెల్స్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×