Brinjal Benefits: వంకాయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది.. గుత్తి వంకాయ కూర.. దాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆహా.. ఏమి రుచి అనరా మైమరచి రోజూ తిన్న మరి మోజే తీరనది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయే నండి. ఈ పాటే గుర్తుకు వస్తుంది కదూ.. ఎన్ని కూరలున్నా వంకాయ కూర రుచే వేరు. వేడి అన్నంలో వంకా కూర జోడించి తింటే ఆ.. రుచే వేరబ్బా. వంకాయ, మన ప్రతిరోజూ తినగలిగే సాధారణ కూరగాయ. ఇది కేవలం రుచికరంగా ఉండడం మాత్రమే కాక, శరీరానికి ఎంతో మేలు చేసే శక్తివంతమైన కూరగాయ కూడా. వంకాయలో ఉండే ప్రధాన పోషకాలు ఏవో తెలుసుకొని, వాటి ద్వారా మన శరీరానికి వచ్చే ప్రయోజనాలను చూద్దాం.
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
వంకాయలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి, శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వంకాయను తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే రక్తనాళాలు గట్టిపడతాయి, ఇది గుండె సంబంధిత వ్యాధులు, సమస్యలు ఏర్పడడానికి కారణమవుతుంది.
వంకాయలోని పచ్చికూరల్లో, పండ్లలో ఎక్కువగా ఉండే సహజ రసాయనాలు, వంకాయ, వెల్లుల్లి వంటి కూరగాయల్లో ఉండే రసాయనాలను తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో, రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది, ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వంకాయ బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. వంకాయ తక్కువ కాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగిన కూరగాయ కావడంతో పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని వల్ల ఎక్కువ ఆహారం తినే అవసరం తక్కువ అవుతుంది, ఫలితంగా బరువు నియంత్రణ సులభం అవుతుంది.
Also Read: Spicy Food: ఎక్కువ కారం తింటున్నారా? అయితే ఇది మీకోసమే!
వంకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని జీవక్రియలను మెరుగుపరుస్తాయి. ఇవి కణాలను రక్షించి, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అంటే, చర్మంలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చేస్తాయి. చర్మం సమస్యలు తగ్గుతాయి, ఫలితంగా చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంటుంది.
హైబీపీ ఉన్న వారికి ఉపయోగపడుతుంది
వంకాయ రక్తపోటు ఉన్నవారికి మేలు చేస్తుంది. వంకాయలోని న్యూట్రియెంట్లు, ముఖ్యంగా పొటాషియం, రక్తనాళాలను విస్తరించి, రక్తపోటును సరిగా ఉంచడంలో సహాయపడతాయి. ఫలితంగా, హైబీపీ సమస్యలు తగ్గుతాయి, గుండె మీద ఒత్తిడి లేకుండా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది.
పుష్కలంగా విటమిన్ B6
నరాల వ్యాధులు, శారీరక, మానసిక ఒత్తిడి సమస్యలు తగ్గించడంలో వంకాయ సహాయపడుతుంది. వంకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B6 శరీరంలోని న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ను సరైన మోతాదులో చేస్తాయి. ఫలితంగా, మూడ్ మెరుగుపడుతుంది, డిప్రెషన్, ఆందోళన సమస్యలు తగ్గుతాయి.
షుగర్ ఉన్నవారికి మంచి ఆహారం
షుగర్ ఉన్నవారికి కూడా వంకాయ మంచి ఆహారం. వంకాయలోని రోబ్ ఫైబర్, ఫ్లావనాయిడ్స్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను క్రమంగా తగ్గిస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్ తగ్గి మందులను ఎక్కువగా వాడాల్సిన అవసరం లేకుండా తగ్గిస్తుంది. వంకాయను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తులు, గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది గ్యాస్ట్రిక్ వ్యవస్థను సక్రమంగా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వంకాయ సాధారణ కూరగాయే అయినా, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు, షుగర్, బరువు సమస్యలు, వృద్ధాప్య లక్షణాలు వీటన్నింటినీ వంకాయ తినడం వల్ల తగ్గించవచ్చు. కాబట్టి, రోజువారీ భోజనంలో వంకాయను తప్పక చేర్చుకుంటే మంచిది.