Sikandar Raja : పాకిస్తాన్ లో జన్మించిన జింబాబ్వే అంతర్జాతీయ క్రికెటర్ సికందర్ రజా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇతను అద్భుతమైన ఆల్ రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత జింబాబ్వే స్టార్ ఆటగాడు సికందర్ రజా తన కెరీర్‌లో తొలిసారిగా ICC పురుషుల వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. 39సంవత్సరాల సికిందర్ రజా రెండు మ్యాచ్ ల్లో 92, 59 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సిరస్ లో అతను 1 వికెట్ కూడా తీసుకున్నాడు. ఇక అప్గానిస్తాన్ జోడీ అజ్మతుల్లా ఒమరాయ్, మహ్మద్ నబీలను అధిగమించాడు. వీరు ఇప్పుడు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. డిసెంబర్ 2023లో రెండో స్థానంలో కొనసాగాడు.
Also Read : Bronco Test : టీమిండియా ప్లేయర్లకు బిగ్ రిలీఫ్.. బ్రాంకో టెస్టులపై బీసీసీఐ సంచలన నిర్ణయం
నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా రజా..
198 పరుగులతో అగ్రస్థానంలో నిలిచి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఏడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. శ్రీలంకకు చెందిన జనిత్ లియానాగే (13 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్), జింబాబ్వేకు చెందిన సీన్ విలియమ్స్ (మూడు స్థానాలు ఎగబాకి 47వ ర్యాంక్‌కు) ఉన్నారు. ముఖ్యంగా సియాల్ కోట్ లో పంజాబీ మాట్లాడే కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు సికందర్ రజా. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్ లోయర్ టోపాలో మూడేళ్లపాటు చదువుకున్నాడు. వాస్తవానికి అతను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలని కోరుకున్నాడు. ఆ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో ఎంపిక కావడానికి తప్పనిసరి పరీక్షలో విఫలం చెందడంతో అతని ఆశ నెరవేరలేదు. రజా మొత్తం 151 పరుగులతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొమ్మిది స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. అతని కెరీర్ బెస్ట్ 24వ స్థానానికి రెండు స్థానాలు దాటి జూన్ 2023లో చేరుకుంది. బౌలర్లలో అతను 38వ స్థానానికి చేరుకున్నాడు.
క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో రికార్డులు
ఐసిసి పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగులతో అజేయంగా నిలిచిన స్కాట్లాండ్ బ్యాటర్ జార్జ్ మున్సే మూడు స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికాకు చెందిన టోనీ డి జోర్జి 67వ స్థానం నుంచి 64వ స్థానానికి చేరుకున్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణను షేక్ చేసి ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరిగిన మొదటి వన్డేలో 22 పరుగులకు నాలుగు వికెట్లు సాధించి ఏకైక నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అసిత ఫెర్నాండో ఆరు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకోగా దిల్షాన్ మధుశంక హ్యాట్రిక్‌తో సహా మొదటి హరారే వన్డేలో 62 పరుగులకు నాలుగు వికెట్లు సాధించి 60వ స్థానం నుంచి 52వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ పురుషుల T20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ మరియు సెడిఖుల్లా అటల్ షార్జాలో జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్‌లో వరుసగా 65 మరియు 64 స్కోర్‌లతో పాకిస్తాన్‌ను ఓడించడంలో సహాయం చేసిన తర్వాత భారీ పురోగతి సాధించారు. జద్రాన్ 12 స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌కు చేరుకోగా.. అటల్ 346 స్థానాలు ఎగబాకి 127వ స్థానానికి చేరుకున్నారు.